The South9
The news is by your side.
after image

అమరావతితో పోలిస్తే వైజాగ్‌ను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటు. సీఎం జగన్.

post top

*తేది: 05-03-2024*

*స్థలం: విశాఖ*

 

*రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో రాబోయే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు #visionvisakhaను ఆవిష్కరించిన సీఎం జగన్*

 

*అగ్ర పారిశ్రామిక వేత్తలు వైజాగ్‌ను ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారు*

 

*అమరావతితో పోలిస్తే వైజాగ్‌ను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటుఅమరావతితో పోలిస్తే వైజాగ్‌ను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటు*

*మళ్లీ గెలుస్తా.. విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా.. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తా.. సీఎం జగన్*

 

Post midle

ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ‘డెవలప్‌మెంట్ డైలాగ్’లో సీఎం జగన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు, రాబోయే దశాబ్దంలో (10 ఏళ్లలో) విశాఖపట్నంను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రగతి కేంద్రాలతో చేయి- చేయి కలిపి తూర్పు తీరంలో మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ #VisionVisakha అనే సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించారు. అందులో విశాఖను ఇన్నోవేషన్, ఫైనాన్షియల్, ఫిన్‌టెక్ హబ్‌లుగా అభివర్ణించారు.వైజాగ్ అత్యంత డిమాండ్ ఉన్న పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తించి, కనెక్టివిటీ, భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ప్రకృతి దృశ్యం, సుస్థిరత వంటివి పెంపోందించే విధంగా, *రాబోయే 10 సంవత్సరాలలో రూ. 1,05,000 కోట్ల పెట్టుబడులను విశాఖ వేదికగా ముఖ్యమంత్రి ప్రతిపాదించారు*. ప్రపంచంలోని ఉత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో విశాఖ ఒకటి. నేడు ‘విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో మంగళవారం సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు.

*హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి*

 

Post Inner vinod found

ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో​ విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. IDPL, NMDC, NFC, IICTతో సహా హైదరాబాద్‌లో పెట్టుబడులు అధికంగా కేంద్రీకృతం కావడం వల్ల, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు ఎక్కువగా వ్యవసాయాధారంగా ఉన్నాయని, మార్పు తీసుకురావడానికి, వైజాగ్ వృద్ధి పై మనం దృష్టి పెట్టాలని, తద్వారా పదేళ్లలో మనం హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడవచ్చని పేర్కొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90 శాతం హైదరాబాద్‌కే పరిమితం అయ్యాయన్నారు. అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్‌ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో సర్వీస్ సెక్టార్ తెలంగాణలో 62 శాతం ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో 40 శాతం మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణ లో 3.12 లక్షలు ఉంటే ఏపీ లో 2.9 లక్షలు మాత్రమే ఉందన్నారు. సుదూర సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూల పాడు పోర్టులు అత్యంత వేగంతో నిర్మాణం అవుతూ ఉన్నాయన్నారు. బ్లూ ఎకానమీని పెంచే క్రమంలో 10 ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు. సర్వీస్ సెక్టార్‌ను విస్తృతం చేయడమే విజన్ విశాఖ లక్ష్యమన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కడప, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు అవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1లో ఉన్నామన్నారు. గత మార్చిలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో 13 లక్షల కోట్ల విలువ చేసే 360 ఎంఓయూలలో 39 శాతం ఎంఓయూలు గ్రౌండ్ అయ్యాయన్నారు. అధికారంలోకి వచ్చాక 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని సీఎం చెప్పారు. పెద్ద పరిశ్రమలు 3, 4 లక్షల ఉద్యోగాలు అందిస్తే ఎంఎస్ఎంఈలు 30 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయన్నారు. 1.5 కోట్ల మహిళలు స్వయం ఉపాధిని సాధించారన్నారు.

 

ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని, గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌న కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. అయితే వైజాగ్‌ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో​ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

 

*విశాఖపై విషం కక్కుతున్నారు*

 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్‌ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండింగ్‌ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ది చెందదని అన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని సీఎం జగన్‌ అన్నారు.

 

*మళ్లీ గెలుస్తా… విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా.. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తా*

 

ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని సీఎం జ‌గ‌న్‌ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటానని స్పష్టం చేశారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజన్‌లా మారుస్తామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని.. ఈనాటికే లక్ష కోట్లంటే వచ్చే 10-15 సంవత్సరాల్లో అది 10లక్షల కోట్లకు పైనే చేరుతుందని వివరించారు. అదే వైజాగ్‌లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్‌ నిర్మిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

 

రాష్ర్ట అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ నుంచి పరిపాలనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఉంటే నగరం అభివృద్ధి బహుముఖంగా జరుగుతుందన్నారు. తనకు ఏమీ వ్యక్తిగత ఆలోచనలు, ప్రయోజనాలు లేవని మరోసారి స్పష్టం చేసారు.రాష్ర్ట అభివృద్ధి ఒక్కటే లక్ష్యమన్నారు. బెంగలూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం వైజాగ్‌కు ఉంద‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

 

*ఏపీలో తగ్గిన నిరుద్యోగం*

 

ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Post midle

Comments are closed.