The South9
The news is by your side.

నిత్యం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మనపాటి చక్రవర్తి

after image

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ముగిసిన సందర్భంగా ఆర్బీఐ బలపరిచిన అభ్యర్థి మన పాటి చక్రవర్తి ఓటర్లు ను ఉద్దేశించి మీడియా కి ఒక బహిరంగ లేఖ ను విడుదల చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై తనకు సహకరించిన ఓటర్ల కు కృతజ్ఞతలు తెలుపుతూ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ఉంటానని ఈ సందర్భంగా ఆ లేఖలో పేర్కొన్నారు…                                                                                                                     ఆ లేఖ పూర్తి సారాంశం ‌‌….                              అందరికీ నమస్కారం…. నేను గత 15 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ఉంటూ వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ సొంతగా వినోద్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాను.. ఈ క్రమంలో ప్రజా స్వామ్యం లో ప్రజలకు బలంగా సేవ చేయాలంటే రాజ్యాధికారమే పరమావధి అని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ప్రకారం తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం జరిగింది. మనిషి జీవితంలో గెలుపు ఓటములు సహజం. నా పోటీ ముఖ్య ఉద్దేశం.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాను.. నా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులకు. మిత్రులకు. సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, మీడియా మిత్రులకు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ, సోదర సోదరీమణులకు… మిగతా ప్రజలకు రుణపడి ఉంటాను. అలానే నామినేషన్ వేసినప్పుడు నుంచి ప్రచార పర్వం ముగిసేవరకు. నా ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నన్ను కాపాడిన నా దేవుడికి ఈ సందర్భంగా వేలాది స్తుతులు తెలియజేసుకుంటున్నాను. నా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని నాకు మద్దతు తెలిపిన ‌, సహకరించిన, సహకరించక పోయినా.. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ… ముఖ్యంగా నా ఈ ప్రయాణంలో నాకు వెన్ను దన్నుగా ఉన్న మా సోషల్ మీడియా టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి . సహాయ సహకారాలు దీవెనలు.. ఉండాలని నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసే శక్తి నాకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ…. మీ వెంటే ఉండే…‌ మీ మన పాటి చక్రవర్తి.8519823999. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం

Post midle

Comments are closed.