
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. .తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన అధికారిక టీ న్యూస్ ఛానల్ లో ప్రముఖంగా ఈ వార్తని ప్రసారం చేయడం జరిగింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని , క్వారంటైన్ లో, ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందువలన ఉన్నందువలన తెలంగాణ గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ ఆలోచన దిశగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది గంటల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.
Comments are closed.