The South9
The news is by your side.
after image

అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా పట్టివేత

post top
  • డ్రైవర్ బంధువు ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిన వైనం
  • మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • మూడు 9 ఎం.ఎం ఫిస్టోల్స్ , 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్ …2.42 కె.జి ల బంగారు ఆభరణాలు, 84.10 కె.జి వెండి ఆభరణాలు, రూ. 15,55,560/ ల నగదు, రూ. 49.10 లక్షల ఫిక్స్ద్ డిపాజిట్ / ఎన్ ఎస్ ఎస్ బాండ్లు, రూ. 27.05 లక్షల ఫ్రాంసరీ నోట్లు, రెండు మహీంద్ర కార్లు, 3 ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లు, హార్లీ & డేవిడ్ సన్ మోటారు సైకిల్ , మరో రెండు కరిశ్మా ద్విచక్ర వాహనాలు, హోండా యాక్టివా, 4 ట్రాక్టర్లు స్వాధీనం
  • భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు, తదితరాలు కల్గిఉండటంపై కేసు నమోదు

అనంతపురం జిల్లా ట్రెజరీలో పని చేస్తున్న ఉద్యోగి ఓ ఇంట్లో దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదును పోలీసులు భారీగా పట్టుకున్నారు. తన డ్రైవర్ మామ ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచినట్లు పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది.
వీటితో పాటు మూడు ఫిస్టోల్స్ , 18 రౌండ్లు, ఒక ఎయిర్ గన్ , ఫిక్స్డ్ /ఎన్ ఎస్ ఎస్ బాండ్లు, ఫ్రాంసరీ నోట్లు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు సి.సి.ఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య ల ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం సి.ఐ సాయి ప్రసాద్ , సి.సి.ఎస్ సి.ఐ శ్యాంరావు, బుక్కరాయసముద్రం ఎస్సై ప్రసాద్ మరియు సిబ్బంది తనిఖీలు చేసి ఈ భారీ నిల్వలు బయటపెట్టారు.

Post Inner vinod found

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గాంధీనగర్ లో ఉంటున్న బాలప్ప ఇంట్లో నిన్న రాత్రి డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆ ఇంట్లో ఉన్న 8 ట్రంకు పెట్టెల్లో మూడు 9 ఎం.ఎం ఫిస్టోల్స్ , 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్ …2.42 కె.జి ల బంగారు ఆభరణాలు, 84.10 కె.జి వెండి ఆభరణాలు, రూ. 15,55,560/ ల నగదు, రూ. 49.10 లక్షల ఫిక్స్ద్ డిపాజిట్ / ఎన్ ఎస్ ఎస్ బాండ్లు, రూ. 27.05 లక్షల ఫ్రాంసరీ నోట్లు సీజ్ చేశారు. వీటితో పాటు రెండు మహీంద్ర కార్లు, 3 ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లు, హార్లీ & డేవిడ్ సన్ మోటారు సైకిల్ , రెండు కరాశ్మా మోటారు సైకిళ్లు, ఒక హోండా యాక్టివా, 4 ట్రాక్టర్లు కూడా సీజ్ చేశారు. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు, తదితరాలు కల్గిఉండటంపై కేసు నమోదు చేశారు.

పట్టుబడిన ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా ట్రెజరీ విభాగంలో సీనియర్ ఆడిటర్ గా పని చేస్తున్న గాజుల మనోజ్ కుమార్ కు సంబంధించినవేనని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇతను జిల్లా కేంద్రంలోని సాయినగర్ 8 వ క్రాస్ లో నివాసముంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్ పోలీసుశాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్ కుమార్ కు జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం వచ్చింది. బుక్కరాయసముద్రంకు చెందిన నాగలింగం ఇతని డ్రైవర్ … భారీగా పట్టుబడిన సొమ్మును దాచిన ఇంటి యజమాని బాలప్ప స్వయాన నాగలింగంకు మామ అవుతాడు. లెక్క చూపని ఈ భారీ సొమ్ములను నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ విభాగానికి ఆంధ్రప్రదేశ్ డి.జి.పి ద్వారా త్వరలోనే బదలాయించనున్నారు. ఇందులో మంచి ప్రతిభను కనపరిచిన పోలీసులకు జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు రివార్డులు ప్రకటించారు.

Post midle

Comments are closed.