The South9
The news is by your side.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంపుదల జీవో విడుదల. ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి.

post top

అమరావతి;

భారీ చిత్రాలు విడుదలకు దగ్గరవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు ధరలను పెంచుతూ జారీ చేసిన జీవో టాలీవుడ్ పరిశ్రమకు ఆనందాన్నిచ్చింది. గత కొన్ని రోజులుగా విడుదల అవ్వాల్సిన జీవో ఐటెం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం మరికొన్ని ఇతర కారణాల వలన విడుదలకు జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలు రాధేశ్యాం, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాలు భారీ వసూళ్లు సాధిస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇన్ని రోజులు ఉన్న సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి, సినిమాటో గ్రఫీ మంత్రి పేర్ని నాని కి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాడు మెగాస్టార్ చిరంజీవి.

after image

★ జీఎస్టీ, థియేటర్ల నిర్వాహణను మినహాయించి టికెట్‌ ధరను గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20గా నిర్ణయించింది.

★ మున్సిపాల్‌ కార్పొరేషన్‌లోని నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం- ప్రీమియం ధరలు ₹40-₹60గా ఉండగా, ఏసీ థియేటర్లలో ₹70-₹100గా, స్పెషల్‌ థియేటర్లలో ₹100-₹120గా, మల్టీపెక్స్‌లో ₹150-₹250గా నిర్ణయించింది.

★ మున్సిపాలిటిల్లో నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం- ప్రీమియం ధరలు ₹30-₹50గా, ఏసీ థియేటర్లలో ₹60-₹80గా, స్పెషల్‌ థియేటర్లలో ₹80-₹100గా, మల్టీపెక్స్‌లో ₹125-₹250గా నిర్ణయించింది

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.