The South9
The news is by your side.

మరో కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో లీక్

post top

కర్ణాటక కొందరు బిజెపి నాయకులకు రసిక హృదయం ఎక్కువైనట్టుంది. గతంలో అసెంబ్లీలోనే నీలిచిత్రాలు చూస్తున్న చరిత్ర కలిగిన నాయకులు ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. అప్పటి నీలి చిత్రాలు వీక్షించిన నేతలే ఇప్పుడు మంత్రులు గా కూడా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో బిజెపి కీలక నేత యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రి రమేష్ జర్కీ హోలీ ఒక యువతితో ఏకాంతంగా గడిపిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక యువతి సదరు మంత్రితో ఏదో పని మీద వెళ్లి ఆయనకి దగ్గర అయిందని తెలుస్తుంది. అయితే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో ని వీరే చిత్రీకరించడం విశేషం. ఈ చర్యతో ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక టీవీ ఛానెల్స్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు, వారికి మంచి మసాలా దొరికినట్లే ఈ పరిస్థితుల్లో.. ఉదయం లేచి విలువలు, హిందుత్వం. మాట్లాడే బిజెపి నాయకులు ఏమి చర్య తీసుకుంటారనేది వేచి చూడాలి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.