The South9
The news is by your side.
after image

క్షీర సాగర మథనం నుంచి మరో మంచి పాట!!

post top

“అచ్చం కొండపల్లి బొమ్మలాగ

స్వచ్చంగున్న ముద్దుగుమ్మ
నిన్ను చూస్తే చాలు మనసు
మెలిక తిరుగుతుందమ్మా…””

Post Inner vinod found

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టర్నడ్ డైరెక్టర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’ నుంచి మరో పాట విడుదలైంది. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు.
“అచ్చం కొండపల్లి బొమ్మలాగ స్వచ్చంగున్న ముద్దుగుమ్మ నిన్ను చూస్తే చాలు మనసు మెలిక తిరుగుతుందమ్మా” అంటూ అజయ్ అరసాడ స్వర కల్పనలో.. వశిష్టశర్మ రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు అనుదీప్ దేవ్ ఆలపించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రంలోని ప్రతి పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ క్రెడిట్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, లిరిక్ రైటర్స్ శ్రీమణి, వశిష్ఠశర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్ లకు దక్కుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Post midle

Comments are closed.