
అమరావతి.
*మరో 2 నెలల్లో ఓ కొలిక్కి రానున్న ఏపీ ప్రాజెక్టులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*మరో రెండు నెలల్లో ఏపీలో పర్యటించనున్న పోర్టులు, ఓడరేవుల శాఖ సహాయ మంత్రి మన్ సుఖ్ మాండవీయ: పరిశ్రమల శాఖ మంత్రి*
*కేంద్ర మంత్రి ఏపీకి వచ్చేలోపు అన్ని ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు పూర్తవవచ్చునని పేర్కొన్న మంత్రి గౌతమ్ రెడ్డి*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం , రామాయపట్నం పోర్టు అభివృద్ధిలో కేంద్ర సహకారం పై ప్రధానంగా చర్చ*
*మారిటైమ్ అభివృద్ధికి ఏపీ పెద్దపీట*
*ఆంధ్రప్రదేశ్ లో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అవసరమైన నిధులలో ఏపీకి రావలసిన మొత్తం కేంద్రమే సమకూరుస్తుందని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి మాండవీయ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

*భావనపాడు కొత్త పోర్టు కావున మేజర్ పోర్టు నిర్మాణంలో జాప్యం లేకుండా రామాయపట్నానికి ప్రాధాన్యతనివ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం*
*భవిష్యత్ లో వాటర్ వేస్, ఎస్ఈజెడ్, రహదారులు, సీ పోర్ట్స్ ల వంటి వాటి నిర్మాణం నేపథ్యంలో రామాయపట్నమైతే అన్నింటికీ అనువుగా ఉంటుందని ప్రతిపాదించినట్లు మంత్రి వెల్లడి*

*భావనపాడు, రామాయపట్నాన్ని పరిశీలించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి వెల్లడించారు : మంత్రి మేకపాటి*
*రామాయపట్నం పరిసరాల్లో పారిశ్రామిక భూములు కూడా పుష్కలం : మంత్రి మేకపాటి*
*రామాయపట్నం లేదా భావనపాడులో ఏదో ఒక పోర్టు నిర్మాణానికి సహకరిస్తామన్నారు*
*రామాయపట్నమే మేజర్ పోర్టుగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా అనువైనదని కేంద్ర మంత్రికి వివరించిన మంత్రి గౌతమ్ రెడ్డి*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర మంత్రి*
*ఏపీలో సాగరమాల కింద చేపట్టిన ప్రాజెక్టులలో ప్రస్తుతం నిలిచిపోయిన వాటిపై సమీక్ష చేసి తిరిగి ఆ ప్రాజెక్టులను చేపడతామని మంత్రి మేకపాటికి హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి*
*ఇప్పటికే భీమిలి, కాకినాడ పాసెంజర్ జట్టీలను ప్రారంభించారని, వీటికి మరిన్ని మౌలిక సదుపాయాలు అందించేందుకు నిధులు కేటాయించడానికి కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి*
*మెడ్ టెక్ జోన్ కు నిధులు, ఏఎమ్ టీజెడ్ లో ఎంఆర్ఐ కేంద్రాల ఏర్పాటు నేపథ్యంలో ఆ ప్రారంభోత్సవానికి మరో 2నెలల్లో కేంద్ర మంత్రి విశాఖకు రావచ్చునన్న మంత్రి మేకపాటి*
*న్యూఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, పోర్టుల శాఖ సహాయ మంత్రి మన్ సుఖ్ మాండవీయను కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి*
Comments are closed.