The South9
The news is by your side.

హోం మంత్రి అనిత చేసిన పనికి బిత్త‌రపోయిన బాలయ్య.

post top

south9 ప్రతినిధి : వెలగపూడి 

after image

హోం మంత్రి అనిత చేసిన పనికి బిత్త‌రపోయిన బాలయ్య

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులతో సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు అయింది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు అధికార ప్రతినిధులు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలు తీరును చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి పలు అంశాలపై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీని బలోపేతం చేయడం కోసం క్రియాశీలక సభ్యత్వ నమోదు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల పైన చర్చిస్తారు. అధికార టిడిపి, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏర్పాటు నాయకుల సమన్వయం, పార్టీ పదవుల పంపకాలు, ఎమ్మెల్సీ ఎన్నికల వంటి అనేక అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు చంద్రబాబు ఈ సమావేశం సందర్భంగా ఓ అనూహ్య‌సంఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు ఊహించని ఘటన ఎదురయింది సమావేశంలో పాల్గొనడానికి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత బాల‌య్య‌కు పాద నమస్కారం చేశారు. పార్టీ నాయకులతో కలిసి బాలకృష్ణ ప్ర‌ధాన ద్వారం వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న వంగలపూడి అనిత నేరుగా ఆయన కాలికి దండం పెట్టారు. ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి స‌విత కూడా బాలకృష్ణకు పాద‌ నమస్కారం చేశారు. వారిని మనస్పూర్తిగా ఆశీర్వదించారు బాలకృష్ణ. చిరునవ్వుతో పలకరిస్తూ పార్టీ కేంద్రంలోనికి తీసుకువెళ్లారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.