south9 ప్రతినిధి :
జగన్ సాక్షి కేసులో తగ్గేదేలే అంటున్న నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాజకీయ పరిస్థితుల్లో తారుమారు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి, జనసేన కార్యకర్తలపై ఎలాంటి కేసులు నమోదు చేశారో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై ఇప్పుడు అలాంటి కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక కేసులు నమోదయ్యాయి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్లారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి జగన్ సీఎం గా ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు నమోదయ్యాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన పైన సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించి తన పరువుకి నష్టం కలిగించారని నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. సాక్షి పత్రిక పైన 75 కోట్ల పరువు నష్టం దావా వేశారు తన పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేయాలని పరువుకి భంగం కలిగించారని తన హోదాన్ని తగ్గించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ నారా లోకేష్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఈ కేసులో నారా లోకేష్ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు తన గురించి సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు వచ్చాయని లేనిపోని వార్తలు రాశారని అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారని లోకేష్ పోర్టును ఆశ్రయించారు. తన మీద వచ్చిన తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని నిజం చేయాలని సాక్షి పత్రిక నమ్మించడానికి ప్రయత్నించిందని ఆ సంస్థ పైన సాక్షి యాజమాన్యం పైన చర్య తీసుకోవాలని కొంతకాలంగా కోరుతూ వస్తున్నారు ఈ కేసులో తాను వెనక్కి తగ్గే పరిస్థితి లేదని లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కూడా పట్టు వీడకుండా ముందుకు సాగుతున్నారు
Comments are closed.