
రేవంత్ చాపకిందకి నీరు…!

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాంగ్స్ ముఖ్యమంత్రులకు, మంత్రులకు వారి మనోభావాలకు అధిష్టానం వద్ద గడ్డిపోచ ప్రాధాన్యం కూడా ఉండదు. ముఖ్యమంత్రి ది కూడా సూట్‌కేసులు మోసే పనే. ఇటీవల తెలంగాణలో విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వెనుక అధిష్టానం నిర్ణయమే బలమైనదని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలు, మంత్రులు, అధిష్టానం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనను పదవి నుంచి తప్పించడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు, హైడ్రా, మూసి నది, గ్రూప్ వన్ విషయంలో రేవంత్ జాగ్రత్త పడాలని లేదంటే ఇబ్బందులు తప్పవని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచల వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల విద్యార్థుల పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తుందని పేదల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ మాటలను పరిశీలిస్తే తెలంగాణలో రెండో కృష్ణుడు ఎంట్రీ ఇస్తాడేమో అని కొందరు వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
Comments are closed.