ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. యువత వీటికి బానిసలుగా మారుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వీటి బారినపడి డబ్బులు నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు కూడా తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగుకు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలని కోరుతూ వాటి వివరాలను ముఖ్యమంత్రి తన లేఖకు జతచేశారు.
Tags: Jagan, Ravishankar prasad, Letter Online gambling apps
Comments are closed.