The South9
The news is by your side.

షేర్ చేస్తున్నారా….. జర జాగ్రత్త

post top

సోషల్ మీడియా విస్తృతంగా పెరిగినా నేపథ్యంలో అన్ని స్మార్ట్ ఫోన్ లొనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ లో న్యూస్ షేర్ చేయడం అనేది పరమావధి లా మారింది. పొలిటికల్ గ్రూప్ లు మీడియా గ్రూప్ లు విస్తృతంగా ఉన్నాయి. గ్రూప్ లో ఉండే సభ్యులు ఒకరి కంటెంట్ ఒకరి పంపడం జరుగుతుంది. దానిలో ఏమి విషయాలు ఉన్నాయి అనేవి కూడా చూడ కుండా చాలామంది మిగతా సబ్యులకు పంపతుంటారు. ఇది చాలా మందికి ఇబ్బంది కలిగించే విషయం అయిన దాని గురుంచి ఆలోచించరు చాలా మంది.

after image

ఈ నేపథ్యంలో ఉదయం నే చాలా మంది వాట్సాప్ లో న్యూస్ పేపర్ ల కి సంబంధించిన పిడిఎఫ్ లను ఫార్వార్డ్ చేస్తుంటారు ఇది పెద్ద ఘన కార్యక్రమం గా భావిస్తారు. అలా చేయడం చట్టరిత్యా తప్పు అది ఎంత మందికి తెలుసో ఎవరికి తెలుసు.ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 43 ప్రకారం నేరం. డిజిటల్ కంటెంట్ దాని ఓనర్ పర్మిషన్ లేకుండా పబ్లిష్ చేయడం చట్టరిత్య నేరం. కాబట్టి ఇంకా నయినా గ్రూప్ అడ్మిన్ లు జర జాగ్రత్త గా ఉంటె మంచిది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.