The South9
The news is by your side.

వైఎస్ షర్మిల మీద తేనెటీగల దాడి

post top

వైఎస్ షర్మిల మీద తేనెటీగల దాడి

after image

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు.. ఇక, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ..ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సాగిస్తున్నారు.. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్‌ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగస్తున్నారు.. అయితే, వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇవాళ తేనెటీగలు దాడి చేశాయి..మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు షర్మిల.. ఇదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.. తన సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో.. తేనెటీగల దాడి నుండి వైఎస్‌ షర్మిల బయటపడ్డారు.. అయితే, తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయినట్టుగా చెబుతున్నారు. ఇక, వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 400 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల.. ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.