SPS నెల్లూరు జిల్లా

“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా యస్.పి. విజయ రావు,IPS.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ.. సమస్యలను విన్నవించుకున్న జిల్లా ప్రజలు.
సమస్యలతో వచ్చిన ప్రజలతో వినయంగా, అంకిత భావం, సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచనలు.
మహిళలను వేధించడం, ఇతర సమస్యలపై వెంటనే స్పందించాలని ఆదేశాలు..
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
ఫిర్యాదులను అత్యధిక ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.
మిస్సింగ్, దొంగతనాల కేసులలో బృందాలను ఏర్పాటు చేసి రికవరీపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశాలు.
అనధికార చీటీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
భూ, సివిల్, కోర్టు పరిధిలోని వివాదాలలో న్యాయపరమైన(DLSA) సలహాలు పొంది మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలి.
*మహిళలు, కుటుంబ సమస్యలలో ఓపిక, ఓర్పుగా వ్యవహరిస్తూ పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాన్ని చక్కదిద్దేలా వ్యవహరించాలని సూచన..*
నమోదు కాబడిన కేసులలో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి, బాదితులకు న్యాయం చేయాలని ఆదేశాలు.
ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించిన యస్.పి. గారు.
కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, దొంగతం కేసులలో రికవరీ, భూ&ఆస్థి వివాదాలు మరియు ఇతర సమస్యలు స్వీకరణ.
*94 ఫిర్యాదులు స్వీకరణ*, అందరికీ భోజనాలు అందించిన యస్.పి.



Comments are closed.