
- బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు జేపీ నడ్డా… జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
- మురళీధర్ రావు, రాంమాధవ్ లకు దక్కని చోటు
- జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి
- కార్యదర్శిగా సత్యకుమార్ నియామకం
భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కొత్తరూపు కల్పించేందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గంలో తెలంగాణ నేత డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు.

కాగా, దగ్గుబాటి పురందేశ్వరికి కూడా తాజా కార్యవర్గంలో సముచిత స్థానం లభించింది. ఆమెను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలుగునేతలు రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు.
Tags: DK Aruna, Vice President, BJP National, JP Nadda, Daggubati Purandeswari
Comments are closed.