The South9
The news is by your side.
after image

నీతులు వల్లించడానికే పెద్ద లా

post top

తమ స్వార్ధ ప్రయోజనాలకోసం సినీ నటులని రాజ్య సభకి పంపిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ‘జయాబచ్చన్ ‘ ఒక ఉదాహరణ. సమాజ్ వాదీ రాజ్యసభ సభ్యురాలు మాట్లాడుతూ ఎవరో ఒకరిద్దరు డ్రగ్స్ తీసుకున్నారని మొత్తం బాలీవుడ్ ని విమర్శించడం అన్యాయం అన్నది. ఎవరో ఒకరిద్దరు అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు అసలు 75% బాలీవుడ్ నటులు,దర్శకులు, నిర్మాతలు,టెక్నీషియన్లు డ్రగ్స్ కి బానిసలు అని తెలీకుండా మాట్లాడుతున్నదా జయా బచ్చన్ ? కాదు. తనకి తేలిసే మాట్లాడుతున్నది. సాక్షాత్తూ తన కూతురు శ్వేతా బచ్చన్ నందా కి డ్రగ్స్ అలవాటు ఉంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో [NCB] విచారణలో బయటపడ్డ రెండు పేర్లలో ఒకటి జోయా అఖ్తర్ రెండోది శ్వేతాబచ్చన్ నందా ది. ఈ సంగతి తెలిసే హడావిడిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకి హాజరయ్యింది జయ. పాల్ఘర్ సాధువుల హత్య గురుంచి కానీ, ఆర్టికల్ 370 రద్ధు మీద కానీ, రామజన్మభూమి వివాదం కానీ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య గురుంచి కానీ,దేశంలో ఉండాలంటే భయంగా ఉంది అని అమీర్ ఖాన్ అన్నప్పుడు కానీ, అసహనం గురుంచి షారూఖ్ ఖాన్ అన్నప్పుడు కానీ నోరు విప్పలేదు కానీ తన కూతురు పేరు బయటపడ్డది త్వరలో విచారణ కోసం NCB సమన్లు జారీ చేయబోతున్నది అని తెలుసుకొని పార్లమెంట్ కి హాజరయ్యింది పాపం !
BJP పార్లమెంట్ సభ్యుడు రవీంద్ర శ్యామనారాయణ్ శుక్లా [ రవి కిషన్ – రేసు గుర్రం విలన్-ఉత్తరప్రదేశ్ లోని గొరఖ్పూర్ పార్లమెంట్ స్థానం నుండి గెలిచాడు ] మొదట మాట్లాడుతూ బాలీవుడ్ లో మాదకద్రవ్యాల వాడకం ఎక్కువయింది అనీ దాని వల్ల తెలీకుండా నేరాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాల్సి ఉందని అన్నాడు.

తిన్న కంచంలో ఉమ్మేయడం:

దానికి కౌంటర్ గా జయా బచ్చన్ మాట్లాడుతూ ‘తిన్న కంచంలో ఉమ్మేయడం ‘ మంచిది కాదు అంటూ పరోక్షంగా రవి కిషన్ ని , కంగనా రౌనత్ ల గురుంచి మాట్లాడింది. అంటే బాలీవుడ్ నేరాలకి అడ్డాగా మారిపోయినా ఫర్వాలేదు కానీ అన్నం పెట్టింది కాబట్టి ఏం జరిగినా చూసీ చూడనట్లు ఉండాలి అని జయా బచ్చన్ ఉద్దేశ్యం. పైగా డ్రగ్స్ తీసుకోవడం నేరమేమీ కాదని దానివల్ల చాలా మంది బతుకుతున్నారనీ కాబట్టి కొకైన్ తీసుకోవడాన్ని చట్టబద్ధం చేయాలని జయా బచ్చన్ ఉద్దేశ్యం . వాహ్ ! తన కూతురు పేరు బయట పడగానే కొకైన్ దేశ ఆర్ధిక వ్యవస్థకి మెలు చేస్తుందని మాట్లాడడం, తన రాజాకీయ బాసు ‘మగవాళ్ళన్నాక రేప్ చేస్తారు ‘ అదో పెద్ద విషయమా ? అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం అయిపోతున్నది. పెద్దల సభ గా పిలవబడే రాజ్యసభలో ఇలాంటి వాళ్ళ అవసరం ఉందా ? అసలు ముంబై చరిత్రని ఒక సారి పరిశీలిస్తే మొదట్లో వ్యభిచారాన్ని అరికట్టడం కష్టం గా ఉందంటూ దానిని చట్టబద్ధం చేశారు. ప్రత్యేకంగా వాళ్ళకో ప్రదేశం కేటాయించారు [కామాటి పురా ] ఇప్పుడు ఈవిడ మాట్లాడడం చూస్తుంటే మాదకద్రవ్యాల సేవనం కోసం ఒక ప్రాంతం కేటాయించి ఆ ప్రదేశంలో మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఎలాంటి శిక్షా ఉండకూడదు ..అంతే కదా ?

Bollywood war between Stars to Politicians

Post Inner vinod found

జయా ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సల్మాన్ ఖాన్ ని, సంజయ్ దత్ ని వెనెకేసుకొచ్చింది కానీ అదే సల్మాన్ ఖాన్ ఐశ్వర రాయ్ సినీ జీవితాన్ని ముగించేస్తే మాత్రం నోరు పెగలలేదు అఫ్కోర్స్ జయా కి కూడా కావాల్సింది ఆదేలెండి.తన కొడుకుకి ఎటూ సినీ జీవితం అంటూ ఉండబోదు అని తెలుసు అదే సమయంలో తన కోడలు కి పేరు ప్రఖ్యాతులు,డబ్బు రాకూడదు ..చాలా మంచి అత్తగారు. ఇంతకీ ‘తిన్న కంచంలో ఉమ్మేయకూడదు ‘ అన్నది కానీ రవి కిషన్ కావొచ్చు , కంగనా కావొచ్చు ఆ ఉమ్మేసిన కంచాన్ని కడగమనడం తప్పు అవుతుందా ? రవి కిషన్ అనుభవం లో చిన్నవాడే కావొచ్చు కానీ అతను అన్నదానిలో తప్పెక్కడ ఉంది ? గతంలో తమ ఇంట్లో అనుమతిలేని కట్టడాలు ఉన్నాయంటూ BMC నోటీసులు ఇచ్చింది కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యా తీసుకోలేదు కానీ అదే కంగనా విషయంలో 24 గంటలు సమయం ఇచ్చి కూల్చివేసినప్పుడు ఇదేంటి అని అడగలేకపోయింది ..అడిగితే వెంటనే తమ ఇంటికి బుల్ డోజర్లు వస్తాయని భయమా ? ఇప్పుడు శివసేన హాపీ , BMC హాపీ కాబట్టి ఇప్పట్లో కూల్చివేతలు ఉండవు ఎందుకంటే తను ఉండేది ముంబై లోనే కానీ హిమాచల ప్రదేశ్ కాదు కదా !
అసలు శ్వేతా బచన్, నందా డ్రగ్స్ మత్తులో ఒక మందలో ఉన్న ఫోటో చాలాకాలంగా నెట్ లో ఉన్నది అందరూ చూశారు కానీ జయబచ్చన్ కి కానీ అమితాబ్ కి కానీ ఈ ఫోటో ఎందుకు కనపడలేదు ? అంటే …..డ్రగ్స్ వాడకంని చట్టబద్ధం చేస్తారని ఆశ కాబోలు అనుకోవాలా ? వారసత్వం, డ్రగ్స్ , అరాచకాలు కి నిలయంగా మారిన బాలీవుడ్ ని ఈవిడ వెనెకేసుకు రావడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా ? కరణ్ జోహార్ ఈవిడ మనవడిని హీరోగా లాంచ్ చేయబోతున్నాడు అంటే శ్వేతా బచ్చన్ కొడుకుని అన్నమాట. అందుకే ఎప్పుడూ సభకి రాని జయ NCB లిస్ట్ లో తన కూతురు ఉందని ఉప్పందగానే ఆఘమేఘాలమీద సభకి వచ్చి ఆవేశంగా మాట్లాడింది.

Bollywood war between Stars to Politicians

రోజుకి సరాసరిన వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం:

Post midle

పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ నుండి డ్రగ్స్ పంజాబ్,నేపాల్ ద్వారా దేశలోకి వస్తున్నాయి. వీటి వల్ల లాభపడేది జిహాదీలు మాత్రమే. వేల కోట్ల రూపాయల వ్యాపారం అందులో సింహభాగం వాటా బాలీవుడ్, రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు, బడా వ్యాపారవేత్తల కొడుకులు,కూతుర్లు ఉన్నారు. రోజుకి సరాసరిన వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. దీని ప్రకారం ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యమో వీళ్లది ? ఇక రియా విషయంలో శ్వేతా బచన్ సానుభూతి చూపించడం దేనికి సంకేతం ?
అమితాబచ్చన్ కార్పొరేషన్ పేరిట ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు తీసి దివాళా తీసిన సమయంలో ఫైనాన్సర్లు అమితాబ్ ఇంటిని వేలం వేసి తమ బాకీలు రాబట్టుకోవాలని సన్నాహాలు చేస్తున్న సమయంలో అమర్ సింగ్ వీళ్ళని ఆదుకున్నాడు ఆర్ధికంగా అలాంటి అమర్ సింగ్ కి తరువాతి కాలంలో వీళ్ళు ఏం చూపించారో ఇక్కడ చెపితే బాగోదు. అమితాబ్ ని నటుడుగానే చూడండి కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే ‘ఛీ ‘ అనిపించేతగా ఉంటుంది. పెళ్ళయి వేరే ఇంటికి కోడలుగా వెళ్ళిన శ్వేతా నందా తన పేరు చివరన బచన్ తోక ఇంకా తగిలించుకోవడంలోనే తెలుస్తుంది వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారో. ఇక ట్విట్టర్ లో జనాలు శ్వేత గురుంచి అడుగుతున్నారు గత వారం రోజులుగా కానీ అమితాభ్ మౌనంగా ఉన్నాడే కానీ బదులివ్వలేకపోతున్నాడు. కౌన్ బానేగా కరోడ్ పతిలో మాట్లాడే సంస్కారవంతమయిన భాషని చూసి అబ్బో వీళ్ళు ఎంత సంస్కారవంతులో అనిపిస్తుంది కానీ అదంతా నటన. మోసపోకండి. ఈ సారైనా పెద్దల పిల్లలు అని కాకుండా కేసులు పెట్టి లోపలేస్తారా లేక కేవలం ప్రశ్నించి వదిలేస్తారా అన్నదే ప్రశ్న. లేని వాడికో న్యాయం , ఉన్నవాడికో న్యాయం ఇంకెన్నాళ్ళు ? మనం ఆశావాహులం కదా ? ఓ సినీ కవి ఉవాచ : ‘జనమంతా జీన్స్ ఫాంటు ఋషులు ‘ అని. ఋషి అంటే రోషం లేని వాడు అని అర్ధం. ఇలానే ఉందామా ?.

SKL_Uk

Post midle

Comments are closed.