The South9
The news is by your side.

కామన్ సివిల్ కోడ్ వస్తోంది: సంజయ్

post top

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ తెచ్చే అంశాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంజయ్ భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అంబేద్కర్ ప్రవచించిన పలు అంశాలను బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు.

after image
అంబేద్కర్ సూచనల్లో 370 ఆర్టికల్ రద్దు వుందని, అందుకే మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని అన్నారు. కామన్ సివిల్ కోడ్ విధానం అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజలందరూ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పాటించాలని సంజయ్ కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోన కేసులు పెరగడానికి నిజాముద్దిన్ మర్కజ్ మసీదు ప్రార్ధనలు వెళ్లి వచ్చిన వారే కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రేషన్ అందరికి అందడం లేదని దీనికి కేసీఆర్ ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలని చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.