The South9
The news is by your side.

కరోనా ట్రీట్మెంట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

post top

న్యూఢిల్లీ : కరోనా రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో , ట్రేస్, టెస్ట్, ట్రీట్, విధానంలో చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అందుకని కరోనా లక్షణాలు కనిపిస్తే కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని సూచించింది. దానివలన రోగి ని మరణం నుంచి తప్పించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఆర్. టి. పి. సి. ఆర్ టెస్ట్ లు పై కూడా కేంద్రం కొత్త సూచనలు చేసింది. టెస్ట్ లో నెగటివ్ వచ్చి కరోన లక్షణాలు ఉంటే ఆ రోగి కి కరోనా ట్రీట్మెంట్ చేయాలని సూచించింది. అలానే ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఏమాత్రం అనుమానం వచ్చినా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలని తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్ లో జరుగుతున్న ట్రీట్మెంట్ లో మార్పులు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం జ్వరం, జలుబు దగ్గు లాంటి లక్షణాలు వచ్చినవెంటనే కరోనా ట్రీట్మెంట్ మొదలుపెట్టాలని చెప్పకనే చెప్పింది అని అర్థం చేసుకోవాలి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.