The South9
The news is by your side.

ప్రముఖ తమిళ దర్శకుడు కె.వి.ఆనంద్ కన్నుమూత

post top

చెన్నై ప్రతినిధి : ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె. వి ఆనంద్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు తీవ్ర మైన గుండెపోటు రావడంతో కన్నుమూసారు. కె.వి.ఆనంద్ వయసు 54 సంవత్సరాలు. మామూలు ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి కోలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా ఎదిగిన వైనం అందరికీ స్ఫూర్తిదాయకం. కె.వి.ఆనంద్ చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చేసి వివిధ పత్రికల్లో ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత కాలంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు పిసి శ్రీరామ్ దగ్గర అ అసిస్టెంట్ గా పని చేసిన కె.వి.ఆనంద్ తన మొదటి సినిమా ‘ ప్రేమ దేశం’ తోనే ఉత్తమ ఛాయాగ్రాహకుడు గా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ‌ తర్వాత కాలంలో శంకర్ దర్శకత్వంలో ఒకే ఒక్కడు, బాయ్స్, శివాజీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఛాయాగ్రాహకుడు గా తన చివరి సినిమాను సూపర్ స్టార్ రజిని నటించిన శివాజీ చిత్రానికి పని చేశారు. తర్వాత దర్శకుడిగా మారి ‘రంగం ‘అనే అద్భుతమైన చిత్రాన్ని తమిళ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పటివరకు ఏడు సినిమాలకి ఆయన దర్శకత్వం వహించారు. కె.వి.ఆనంద్ లాంటి మంచి ప్రతిభావంతుడైన దర్శకుడు కోల్పోవడం తమిళ చిత్ర పరిశ్రమకే కాక తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ‘ద సౌత్ 9’తరపున ప్రగాఢ సానుభూతి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.