సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా సౌత్ ఇండియన్ ఐకానిక్ అవార్డ్స్ -2025 బ్రోచర్ ఆవిష్కరణ.

పత్రికా ప్రకటన
తేదీ: 3-4- 2025
అమరావతి

సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా సౌత్ ఇండియన్ ఐకానిక్ అవార్డ్స్ -2025 బ్రోచర్ ఆవిష్కరణ*
అమరావతి: త్వరలో సౌత్ 9 మీడియా మరియు వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సౌత్ ఇండియన్ ఐకానిక్ అవార్డ్స్ -2025 బ్రోచర్ ను రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. గురువారం వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్ లోని మంత్రి కందుల దుర్గేష్ పేషీలో సౌత్ 9 మీడియా మరియు వినోద్ ఫౌండేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. మేలో తమ ఆధ్వర్యంలో జరగనున్న సౌత్ ఇండియన్ ఐకానిక్ అవార్డ్స్ -2025 బ్రోచర్ ఆవిష్కరించవలసిందిగా మంత్రి దుర్గేష్ ను కోరగా వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత మీడియా, ఫౌండేషన్ మరియు సంబంధిత కార్యక్రమం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ 9 మీడియా ఎడిటర్ మనపాటి చక్రవర్తిని,మరియు సభ్యుల ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు.
…..
Comments are closed.