
*23-1-2023*
*తాడేపల్లి*
*అసెంబ్లీ సెగ్మెంట్ యూనిట్ గా రోడ్ల అభివృద్ధి*
*ఫేజ్ 1 రోడ్ల నిర్మాణం జూన్ లోపు పూర్తి చేయాల్సిందే*

*బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులకు తక్షణ ఆదేశాలు*
*కోస్తా జిల్లాల్లో ఎఫ్ డీ ఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం సీఎం జగన్*

ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలను యూనినట్ గా తీసుకుని రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన రోడ్ల మరమ్మత్తు పనులు ఈ ఏడాది వేసవలోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సెగ్మెంట్ యూనిట్ గా చేపట్టే రోడ్ల నిర్మాణాల్లో ఫేజ్ 1 పనులను జూన్ లోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా జిల్లాల కనెక్టివిటీ కోసం చేపట్టే స్టేట్ హైవేల కోసం బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ రోడ్లు భవనాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల అభివృద్ధి, నూతన రోడ్ల నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రోడ్ల అభివృద్ధిపై ఉన్నత స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా వేస్తున్న రోడ్లను పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కొత్తగా నిర్మించే రోడ్లు కనీసం రెండేళ్లకే రిపేర్లు వచ్చే పరిస్థితులు ఉండరాదన్నారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్ల పాటు పాడవ్వకుండా ఉండేలా సరైనా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
కడప, బెంగళూరు రైల్వే లైను, విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరమ్మత్తులకు గురైన రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన రోడ్ల వివరాలను వెబ్ సైట్లు, పబ్లిక్ ప్లాట్ ఫాంలు, ఆయా ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజల ముందుంచాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.
*కోస్తా జిల్లాల్లో ఎఫ్ డీ ఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం*
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోవడానికి పరిష్కారంగా ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్) టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్న అధికారులు ప్రతిపాదనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఇదే టెక్నాలజీ వాడాలని ఆదేశించారు. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వచ్చే జూన్, జులై నాటికి ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్ యాప్‌ను సమీక్షా సమావేశంలో సీఎం ప్రారంభించారు. ఈ యాప్ రోడ్ల మరమ్మత్తుల కోసం స్థానిక ప్రజా ప్రతినిధులతో సహా ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యాప్ ద్వారా ఫొటోలను అప్‌లోడ్ చేయగానే అవకాశం ఉంటుందని, జియో కోఆర్డినేట్స్‌తో పాటుగా ఫిర్యాదు నమోదు చేస్తుందన్నారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా యాప్ పై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా ఫలానా చోట రోడ్డు రిపేరు చేయాలని ప్రజలు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments are closed.