The South9
The news is by your side.
after image

ఎస్సీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామా: ఎంపీ నందిగం సురేశ్.

post top

తేదీ: జనవరి 24,

*ఎస్సీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామా: ఎంపీ నందిగం సురేశ్ సవాల్*

– రామోజీ-బాబులు ఎస్సీలపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారంటూ ఫైర్
– రామోజీ బొజ్జ రాక్షసుడిలా తయారయ్యాడని మండిపాటు
– కుళ్ళు, కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్లు రామోజీ, బాబేనంటూ ఎద్దేవా
– పవన్ ఎస్సీ, బీసీలను సభల్లో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడా అంటూ ప్రశ్నించిన ఎంపీ

Post Inner vinod found

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ మండిపడ్డారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వేరే పథకాలకు మళ్లించారని.. ఎస్సీలకు అన్యాయం రిగిందని ఈనాడు పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, రామోజీ ఎస్సీలు, ఎస్టీ, బీసీలను అణగదొక్కాలనే చూశారు కానీ వారిని ఏనాడు ప్రేమగా చూసింది లేదని విమర్శించారు. గత టీడీపీ పాలనలో వేరే పథకాలకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించలేదా అని ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వివిధ పథకాలకు వాడినట్లు ఆధారాలను మీడియాకు చూపారు.ఆనాడు ఈనాడు రామోజీ ఎందుకు ఈ రాతలు రాయాలేదంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు కేవలం 33 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని.. అదే, జగన్ ఈ మూడున్నరేళ్లలోనే ఎస్సీల సంక్షేమం కోసం రూ.48 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.

*ఈనాడు చూడకూడదు, చదవకూడదు*
రామోజీ రావు ఓ బొజ్జరాక్షసుడిలా మారి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషంకక్కుతున్నారని సురేశ్ మండిపడ్డారు.ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా.. అన్న బాబును రాజకీయాల్లో కొనసాగించాలా లేక జైల్లో పడేయాలా? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాసే ఈనాడు చూడకూడదు, చదవకూడదు, మాట్లాడకూడదు అని అన్నారు. కుళ్ళు, కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్లు రామోజీ, బాబు అని మండిపడ్డారు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్న బాబు చంకనెక్కిన పవన్ ఎస్సీలను ఉద్ధరిస్తాడా.. అని ప్రశ్నించారు.’రామోజీ సొంత గ్రామంలోగానీ, చంద్రబాబు సొంత గ్రామంలోగానీ.. ఎస్సీలకు చంద్రబాబు ఎంతిచ్చాడు..మేము ఎంతిచ్చామో లెక్కలు తీద్దామా..?’ అని సురేశ్ సవాల్ విసిరారు. తాము ఆయా గ్రామాల్లో ఎంత ఇచ్చామో కరపత్రాల ద్వారా గడప గడపకూ మా ఎమ్మెల్యేలు వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే.. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని అడ్డుకున్న చంద్రబాబు గురించి మాత్రం రామోజీ రాయడని ఎంపీ మండిపడ్డారు. పైగా, చంద్రబాబుకు భజన చేస్తూ, అలా ఇళ్ళ పట్టాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ఈ పచ్చ మీడియా ఆనాడు రాతలు రాసిందని ఫైర్ అయ్యారు. అలాంటి వారు ఆకస్మికంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అంటూ లేని ప్రేమ చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఆనాడు ఎస్సీలకు ఇచ్చిన పథకాలు కూడా లబ్ధిదారుల ఇంటికి చేరలేదని.. తమ ప్రభుత్వ హయాంలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లోకి డీబీటీ ద్వారా వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు.

*ఎస్సీ, బీసీలను పక్కన కూర్చోబెట్టుకున్నావా.. పవన్‌?*
ఏనాడైనా పవన్‌ కళ్యాణ్‌…తన సభల్లో తన అన్నను, నాదెండ్ల మనోహర్‌లను తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గీయులను పక్కన కూర్చోబెట్టుకున్నాడా అని సురేశ్ ప్రశ్నించారు. అలాంటి పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలిస్తే ఆతన్ని వెంటేసుకుని ఏ వేదికపైకి అయినా తీసుకెళ్లరా అని ప్రశ్నించారు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు చంకనెక్కిన పవన్‌ కూడా తమ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రామోజీ సిగ్గు, బిడియం అన్నీ వదిలేసి.. ఈ వయసులోనూ నీచమైన రాతలు రాస్తున్నాడని మండిపడ్డారు. రామోజీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ని పైకి పంపించిన ఈ దుష్టచతుష్టయం అంతా అక్రమ మార్గంలోనే నడుస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీలకు ఉన్నత స్థానాలు రాకూడదు..ఎప్పుడూ చంద్రబాబే పరిపాలించాలని వారు కోరుకుంటున్నారని ఆక్షేపించారు. ‘మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీరేం చేశారో.. ప్రజలకు చెప్పే దమ్ముందా..? మేమేం చేశామో చెబుతాం..’ అంటూ సవాల్ విసిరారు. కుక్కమూతి పిందెలు లాంటి వ్యక్తులు లోకేష్, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను అధికార పీఠం ఎక్కించడానికి రామోజీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఫలించబోవన్నారు.

*టీడీపీ, రామోజీ రాతలనే పవన్‌ వళ్లిస్తాడు*
‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న చంద్రబాబును పవన్‌ కళ్యాణ్‌ పశ్నించాలి కదా..? అలా ప్రశ్నించకపోగా, ఆయన చంకనెక్కి నీతులు చెబుతాడు’ అంటూ ఎంపీ సురేశ్ ఫైర్ అయ్యారు. పవన్‌ టీడీపీ వారు ఇచ్చే స్క్రిప్ట్‌ చదవడం మానేసి, తన సొంతగా ఏదైనా ఎజెండా ఉంటే మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. టీడీపీ,రామోజీ రాసే రాతలే పవన్‌ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర వల్ల వాళ్ళ పార్టీలో మార్పు సంగతి ఏమోగానీ.. ఆయన శరీరంలో మార్పు వస్తుందేమోనంటూ సెటైర్లు వేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోడానికి ఆయనేమీ పెద్ద పనోడు అయితే కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Post midle

Comments are closed.