
సౌత్ 9 ప్రతినిధి :
జర్నలిస్టులపై దాడులను ఖండించండి.
సినీనటి మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి.
.:ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ డిమాండ్.

ఉభయ రాష్ట్రాలలోని జర్నలిస్టులపై ఇటీవల దాడులు అధికమయ్యాయని, ఇందుకు నిదర్శనమే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేయడం అని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక సెలబ్రిటీ గా ఉన్న వ్యక్తి, సంఘంలో ఎంతో పేరున్న వ్యక్తి విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. కుటుంబంలో వచ్చిన సమస్యను పరిష్కరించుకో లేక వాస్తవాలను వెలికి తీసి చూపుతున్న మీడియాపై మోహన్ బాబు అక్కసు వెళ్ళగక్కడమే కాక మీడియా ప్రతినిధులను టార్గెట్గా చేసుకొని మాట్లాడడం, వారిపై దాడి చేయడం అలాంటి చేష్టలను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. వెంటనే దాడికి కారణమైన మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనపాటి చక్రవర్తి మాట్లాడుతూ…..
ఒక వ్యక్తినీ సెలబ్రిటీ చేయాలన్నా, రాజకీయ నాయకుడిని చేయాలన్నా మీడియా పాత్ర ఎంతో ప్రముఖమైనది అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం చూస్తుంటే ఆయనకు ఉన్న అహంకారం బయటపడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోహన్ బాబు పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ ఛానల్ జర్నలిస్టులు, కెమెరామెన్లు, యు ట్యూబ్ వివిధ రకాల చానళ్లకు సంబంధించిన, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం లో భాగంగా జర్నలిస్టులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు.

Comments are closed.