
నెల్లూరు
ప్రతినిధి సౌత్ 9:
*క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం : మాజీ ఎమ్మెల్యే మేకపాటి*
*: నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం*
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారని, ఇందుకోసం పార్టీలో చురుగ్గా పనిచేసే వారితో కమిటిలను ఏర్పాటు చేసి పార్టీ నిర్మాణాత్మకంగా బలంగా ఉండేలా దృష్టి సారిద్దామని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
బుధవారం ఆత్మకూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో నియోజవర్గంలోని పలు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి అనంతరం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్దమవుతున్నారని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు రోజుల పాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు.
ఆయన పర్యటన ప్రారంభానికి ప్రారంభానికి ముందే పార్టిలోని జిల్లా కమిటిలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి స్థానాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ కమిటిలు, అనుబంధ కమిటిలు, గ్రామ కమిటిలు, గ్రామ అనుబంధ కమిటిలన్నింటిని భర్తీ చేసేలా నాయకులు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అన్నారు.
దీంతో ఏర్పాటు చేసిన కమిటిల సభ్యులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తు కార్యాచరణ ఆయన ఆదేశాలకు అనుగుణంగా చేద్దామని, ప్రస్తుతం ఏర్పాటు చేసే కమిటిల సహకారంతో పార్టీని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లవచ్చునని పేర్కొన్నారు
ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయకుండా ఎటువంటి అవరోధాలు సృష్టించినా తన దృష్టికి తీసుకురావాలని, వాటిపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓటమిలోని నిరాశ నిస్పృహలో నుంచి బయటకు వచ్చి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చేలా పోరాటాలకు సిద్దం కావాలని, ఈ నెల 13వ తేది నిర్వహించిన అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ విజయవంతమైందని, ఈ నెల 27న పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసనగా జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
Comments are closed.