
తరతరాలకు చెరగని నమ్మకం సువర్ణభూమి.
క్రైమ్ ప్రతినిధి
సౌత్ 9 హైదరాబాద్
తరతరాలకి చెరగని చిరునామా సువర్ణభూమి అనే నినాదంతో ప్రముఖ నేపాధ్య గాయకుడు దివంగత బాలసుబ్రమణ్యం, దిగ్గజ దర్శకుడు దివంగత కే విశ్వనాథ్ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రారంభమైన సువర్ణభూమి రియల్ ఎస్టేట్ సంస్థ అనతి కాలంలోనే అగ్రగామి సంస్థగా నిలబడింది.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులు క్రితం సువర్ణ భూమి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ తమను మోసగించిందని కొంతమంది మీడియా ముందుకు వచ్చారు.
వారు చేసిన ప్రధానారోపణ మేము సంస్థ ఎండి బొల్లినేని శ్రీధర్ కి పెట్టుబడిగా డబ్బులు ఇచ్చామని వాటిని రెండింతలుగా తిరిగి మాకు చెల్లిస్తారని మీడియా ముందుకు వచ్చి చెప్పేరు. దీనికి సంబంధించి మీడియాలో పలురకాల కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సౌత్ 9 ప్రతినిధి..ప్రత్యేకంగా సువర్ణభూమి సంస్థ ఎండి బొల్లినేని శ్రీధర్ ని సంప్రదించగా .. దీనిపై ఆయన పూర్తి వివరణ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ……
రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారంలో ,మా దగ్గరికి రకరకాల వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ చేసే దానికి వస్తూ ఉంటారు,దాంట్లో భాగంగా వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ దామాషా ప్రకారం వారికి ఎంత భూమి చెందుతుందో దాని విలువ ఎంత ఉంటుందో వెంచర్ పూర్తయిన తర్వాత వారికి చెల్లించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎం ఓ యు లో స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది.
కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య జరిగిన సంఘటన కొంత మిస్ కమ్యూనికేషన్ వల్ల జరిగిందని,
నా దృష్టికి వచ్చిన వెంటనే దాని పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశామని తెలిపారు.
దాంట్లో భాగంగానే కొంతమందికి భూమిని ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయడం, ఆ పత్రాలు వారికి అందజేయడం జరిగిందని తెలిపారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మా వివరణ కూడా తీసుకుంటే పూర్తి అవగాహన తెలిసేదని అన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తొందరపడి నిరసన కార్యక్రమం చేసామని కొంత సంవయనం పాటించి ఉంటే బాగుండేదని చెప్పడం కొసమెరుపుగా నిలిచింది.
Comments are closed.