అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఐ టి , భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో కూడిన జ్వరం ఉందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. గత వారం నుంచి తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అని సూచించారు.
https://twitter.com/MekapatiGoutham/status/1385486531314425858?s=19

ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అలానే తెలంగాణ ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ కూడా కోవిడ్ పాజిటివ్ గురైనట్లు తెలిపారు. గత మూడు రోజుల క్రితం వారి తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాజిటివ్ నిర్ధారణ కాగా ఆయనకు తోడుగా నిన్న హాస్పిటల్ కి కేటీఆర్ వెళ్లడం జరిగింది దాంతో కేటీఆర్ కూడా పరీక్షలు చేయించుకో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇలా ఇరు రాష్ట్రాల ఐ టి మంత్రులు కు కరోనా పాజిటివ్ కావడం యాదృచ్ఛికమే.



Comments are closed.