న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ఎన్.వి.రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, జస్టిస్ రమణ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రా లోని కృష్ణా జిల్లా పొన్నవరం ప్రాంతానికి చెందిన జస్టిస్ ఎన్వి రమణ దేశ అత్యున్నత పదవి అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా నియమించడంతో ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తులు లావు నాగేశ్వరరావు సహా కేబినెట్ సెక్రటరీ, లా సెక్రటరీ, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.



Comments are closed.