తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు ఈవీఎం లో భద్రంగా ఉన్నాయి మరికొన్ని రోజుల్లో అనగా మే 2న ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే. అయితే అందరి అంచనాలు అధికార వై .ఎస్ .ఆర్ .సి. పి .కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది విశ్లేషకుల వాదన. ఇంకా మూడు ఏళ్లు అధికారంలో ఉండగా ఇప్పుడు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఏది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి మేమే ప్రత్యామ్నాయమని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన శక్తినంతా ప్రదర్శించింది. చంద్రబాబు ,లోకేష్, తో పాటు తెలుగుదేశం క్యాడర్ అంతా పది రోజులు తిరుపతిలోనే మకాం వేసి ఈ ఎన్నికను జరిపించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే వై ఎస్ ఆర్ సి పి మెజార్టీ తగ్గించి రెండో స్థానానికి వస్తే ప్రత్యామ్నాయం మేమే అని చెప్పాలనేది వారి ఉద్దేశ్యం.
అయితే చివరి నిమిషం దాకా అభ్యర్థిని తేల్చకుండా ఉండడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ అంత బలంగా ఉండకపోవడం ప్రతికూల అంశాలు. గత 2019 ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి రావడంతో వారి బలం ఎంత ఉందనేది ఊహించడం పెద్ద విషయమేమీ కాదు. అయితే .ఈ ఎన్నికల్లో ద్వితీయ మరియు తృతీయ స్థానానికి వారు వస్తారు అనుకోవడం లో వారి అంచనాలు ఏమిటనేది తెలియడం లేదు. అయితే ఎక్కువ ఓట్లు సంపాదిస్తే బిజెపి అధిష్టానం పెద్దల దగ్గర వారి పరపతి పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని, తద్వారా వైయస్సార్ సిపి కి మేమే ప్రత్యామ్నాయమని చెప్పొచ్చని అంటున్నారు. అది ఎంత వరకు నిజం కాబోతుంది అనేది మే 2న తేలుతుంది.



Comments are closed.