
చెన్నై ప్రతినిధి: ప్రముఖ దక్షిణ అగ్ర దర్శకుడు శంకర్ కి రోజుకు ఒక వివాదం వెంటాడుతోంది. రోబో 2 చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ తో శంకర్ భారతీయుడు-2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర నిర్మాణం ఉండగానే శంకర్ రామ్ చరణ్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి అంగీకారం తెలపడంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తమ చిత్రం పూర్తి అవ్వకుండా, శంకర్ వేరొక చిత్రానికి దర్శకత్వం వహించడం ఆపాలని హై కోర్ట్ కి విన్నవించుకుంది. ఈ నేపథ్యంలో లైకా సంస్థ వాదనలు విన్న తర్వాత ఇరువర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది చెన్నై హైకోర్టు. మరి ఆ సమయానికి సమస్యను పరిష్కరించుకుంటారు లేదా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అన్ని యన్’ చిత్రాన్ని హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మాణ సారథ్యంలో రణవీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతుంది అని శంకర్ మీడియా కి తెలపడంతో. ఆస్కార్ రవిచంద్రన్ న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ చిత్రానికి నిర్మాత తనని ఈ చిత్రంపై పూర్తి హక్కులు తనకే చెంది ఉంటాయని, అయితే తనను సంప్రదించకుండా రీమేక్ చేయడాన్ని ఆస్కార్ రవిచంద్రన్ తప్పుపట్టారు. దీనిపై ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో శంకర్ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించమని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ రవి ని సంప్రదించగా ఫిర్యాదు అందిందని దీనిపై శంకర్ ని వివరణ అడిగామని తన వివరణ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. సహజంగా ,రీమేక్ రైట్స్ నిర్మాత దగ్గరే ఉంటాయని సదరు దర్శకుడు రీమిక్ చేయదలిస్తే ఆ దర్శకుడు నిర్మాతకు కూడా కొంత మొత్తాన్ని చెల్లించి హక్కులు తీసుకుంటారని తెలిపారు. మొత్తానికి పలు వివాదాల్లో చిక్కుకోవడంతో శంకర్ తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాడు.
Comments are closed.