టాలీవుడ్ లో ప్రస్తుతం తన స్టెప్పులతో ఉర్రూతలూగిస్తున్న డాన్స్ మాస్టర్ భాను అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోలతో పాటు యంగ్ జనరేషన్ హీరోలకు కూడా తన మార్క్ నృత్య దర్శకత్వం తో పాటు కథని ఫాలో అవుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న డాన్స్ మాస్టర్ భాను. అఖండ లో నందమూరి బాలకృష్ణ చేత జై బాలయ్య పాటకి నృత్య దర్శకత్వం వహించి అందర్నీ అలరించి, ఆ పాట మరువకముందే మరో అద్భుతమైన పాటకి తనదైన శైలిలో స్టెప్పులు వేయించారు.
డీజే టిల్లు ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ కి డాన్స్ మాస్టర్ భాను వేయించిన స్టెప్పులు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. యూట్యూబ్ లో మేకింగ్ వీడియో ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఈ చిత్రం రిలీజ్ కాకుండానే ఇలా ఉంటే చిత్రం విడుదల తర్వాత తెలంగాణ ఆంధ్రా లో డీజే టిల్లు సాంగ్ మారి మోగడం కాయం . ఇంకా ఇలా ఎన్నో గొప్ప పాటలకి నృత్య దర్శకత్వం వహించాలని ఆశిస్తున్నాము.
Comments are closed.