ప్రపంచ మంత కరోనతో తల్లిడిల్లిపోతుంటే ,కొంత మంది కి మాత్రం ఈ కరోన కామధేనువు లా కనిపిస్తుంది. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కరోన పేరుతో లక్షలు దండుకుoటున్నారు. కరోన ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం కొన్ని ప్రవేట్ హాస్పిటల్స్ కి కరోన వైద్యం చేసే సదుపాయాన్ని ఇచ్చింది. వీటికి నాన్ కోవిడ్ హాస్పిటల్స్ అని నామకరణం చేసింది. ఎంత ఫీజు వసూలు చేయాలనే విషయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే ఆరోగ్య శ్రీ పథకం ని దీ నికి వర్తించే లాగా, ఆ బిల్లు లను ప్రభుత్వం చెల్లింపు చేసేలాగా నిర్ణయించారు, ఈ విషయాలను పర్యవేక్షణ కి జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ ని అధికారి గా నియమించారు. ప్రభుత్వం ప్రకారం ఫీజుల వివరాలు వెంటిలేటర్ లేని icu కి రోజుకి5480,బైపాస్ cpcp77580(అధిక ఇన్ఫెక్షన్)వెంటిలెటర్ లేకుండా6280సేపిస్ వెంటిలేటర్ పై 10380 ప్రేవేటు రూమ్ కి 600 రూపాయి లు నిర్ణoచారు.
వాళ్ళ దోపిడీ వివరాలు icu కి రోజుకి 50 వేలు… రూమ్ కి రోజుకి ,15 వేలు నుంచి 25 వేలు వరకు హాస్పిటల్ ను పట్టి ఇలా ఐదారు రోజులకు 3 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్నారు, ఈ మధ్యనే ఒక టీచర్ కి 14 లక్షల బిల్ వేసేరని సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు పర్యవేక్షణ సున్నా గా ఉంది. దీనికి సంబంధించిన అధికారి ఎంజెంట్ లా ద్వారా నెలకు 25 లక్షలు వసూళ్లు చేస్తున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటకైనా జిల్లా ఉన్నత అధికారులు,కలెక్టర్ గారు స్పందించి ప్రజలని కాపాడాలని కోరుకుంటున్నారు ప్రజలు.
Comments are closed.