The South9
The news is by your side.

ఒక యజ్ఞంలా చేస్తోన్న జగన్‍

post top

సోషల్‍ మీడియాతో మీకు పరిచయం వుండుంటే ఈపాటికే పూరీ మ్యూజింగ్స్ మీ చెవిన పడి వుండాలి. అవును… ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‍ తన ఆలోచనలను ‘పూరీ మ్యూజింగ్స్’ పేరిట వినిపిస్తున్నాడు. ఆ టాపిక్‍ లేదు, ఈ టాపిక్‍ లేదు…. అమ్మాయిల నుంచి, సెక్స్ నుంచి, బుద్ధుడి నుంచి దోమల వరకు అన్ని టాపిక్స్ గురించి పూరి తన భావాలు వ్యక్తపరుస్తున్నాడు.

షూటింగ్స్ వున్న టైమ్‍లో కూడా ఖాళీ వున్నపుడల్లా ఇంటర్నెట్‍ బ్రౌజింగ్‍ చేసే పూరి తనకు తెలియని ప్రతి దాని గురించీ చదివేస్తుంటాడు. కేవలం సినిమాలకు పనికొచ్చే అంశాలే కాకుండా ప్రపంచంలోని అన్ని వింతలు, విశేషాల గురించీ పూరి తెలుసుకుంటూ వుంటాడు. ఆ జ్ఞానమంతా ఇప్పుడు ఇలా మ్యూజింగ్స్ ద్వారా అందరికీ పంచేస్తున్నాడు. అయితే ఈ మాటలన్నీ తనదైన శైలిలో మాస్‍ పదజాలం జోడించి చెబుతూ వుండడంతో చాలా మంది ఇన్‍స్టంట్‍గా కనక్ట్ అయిపోతున్నారు. కొందరయితే ఈ మ్యూజింగ్స్ కి అడిక్ట్ అయిపోయారు.

after image

ఎప్పుడో వారానికో ఒక టాపిక్‍ గురించి మాట్లాడ్డం కాకుండా అదే పనిగా ఒక యజ్ఞంలా ఈ మ్యూజింగ్స్ తో పూరి తన ఫాలోవర్స్ కి జ్ఞానం పంచుతున్నాడు. కొన్ని టాపిక్స్ పై పూరి అభిప్రాయాలకి నిరసన వ్యక్తమయినా కానీ పూరి అవేమీ పట్టించుకోకుండా తదుపరి టాపిక్‍కి వెళ్లిపోతున్నాడు. అన్నీ మూడు, నాలుగు నిమిషాల ఆడియో క్లిప్పులే కనుక సరదాగా ఓ చెవి వేయండి. పూరి స్టైల్లో చెప్పాలంటే… ఫ్రీగా నాలెడ్జ్ దొరికితే వినడానికి నొప్పేంటి చెప్పండి.

Tags: puri jagannath director, puri musics, social media

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.