*ఏడీఎఫ్ సౌజన్యంతో పాఠశాలకు బెంచీలు వితరణ*
చేజర్ల మండలం ఏటూరు గ్రామ ప్రాధమిక పాఠశాలకు ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా బుధవారం 10 బెంచిలను వితరణగా అందచేశారు.
నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మర్రిపాడు మంఢలం భీమవరం వైఎస్సార్సీపీ నాయకులు, ఏటూరు పంచాయతీ పరిశీలకులు బొర్రా వెంకటేశ్వరరెడ్డి తన స్వంత నిధులతో ఏడీఎఫ్ ఆధ్వర్యంలో ఏటూరు పాఠశాలకు బెంచిలను అందచేయడం జరిగిందని వివరించారు.
ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్దికి ముందుకు వస్తున్నారని, వారందరి సౌజన్యంతో నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు సౌకర్యవంతంగా విద్యను అభ్యసించేందుకు బెంచిలను అందచేసిన వెంకటేశ్వరరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
Comments are closed.