The South9
The news is by your side.
after image

పిల్లల చదువులను ప్రోత్సహించేలా ‘వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా’: సీఎం జగన్.

post top

తేది : 23-11-2023*

*స్థలం :తాడేపల్లి*

*10,511 జంటలకు వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు రూ.81.64 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌*

 

*పిల్లల చదువులను ప్రోత్సహించేలా ‘వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా’: సీఎం జగన్*

 

*గతంలో మొక్కుబడిగా పథకాలు అమలు చేసేవారు, మనం గతం కంటే మెరుగ్గా కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం అందిస్తున్నాం*

 

‘‘వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారి చదువులను మరింత ప్రోత్సహిస్తున్నాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా దివ్యాంగులు, నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలు విద్యావంతులు కావాలనే 10వ తరగతి నిబంధన తెచ్చాం, వయో పరిమితి వల్ల బాల్య వివాహాలు తగ్గుతాయి’’ అని సీఎం జగన్ అన్నారు. ఈఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది జంటలకు ఈరోజు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు. అంతకుముందు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

 

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి.. తమ పిల్లలకు గౌరవ ప్రదంగా పెళ్లీళ్లు చేసి.. పిల్లలకు వివాహ జీవితాలను మొదలుపెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుందని.సీఎం జగన్ అన్నారు పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు వీరందరినీ ప్రతీ సందర్భంలో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ వారిపై ఓనర్‌షిప్‌ తీసుకుంటూ.. వారంతా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైనవారని భరోసా ఇస్తూ.. ప్రతి అడుగులోనూ వారిని చెయ్యి పట్టుకొని నడిపించే గొప్ప కార్యక్రమంలో మరో ముందడుగు ఈరోజు మనం అమలు చేస్తున్న వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా కార్యక్రమం అని పేర్కొన్నారు.

 

Post midle

ఈ పథకం ద్వారా జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న ఆ జంటలను ఆశీర్వదిస్తూ దాదాపు 10,511 మంది జంటలకు ఈరోజు రూ.81.64 కోట్ల ఆర్థికసాయాన్ని తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని, ఈ పథకంలో ఇప్పటి వరకు మూడు త్రైమాసికాల్లో ఆర్థికసాయం అందజేయడం జరిగిందని, 2022 అక్టోబర్‌నుంచి మొదలుపెడితే ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు అవుతుందని తెలిపారు.

 

Post Inner vinod found

గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదని బేరీజు వేసుకుంటే.. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయని సీఎం చెప్పారు, గత ప్రభుత్వం ఏరోజూ చిత్తశుద్ధి, నిజాయితీతో ఒక మంచి పథకం తీసుకురావాలని, దాని ద్వారా పేదలకు మంచి జరగాలనే తపన, తాపత్రయం చేయలేదుని ఎద్దేవా చేశారు. ఒక పథకం తీసుకువస్తే దాని వెనుక ఒక ఉద్దేశం, సంకల్పం ఉండాలని, ఆ సంకల్పం మంచిదై ఉంటే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడని, చేసే మంచి మనసును ఆశీర్వదిస్తాడని.,ఆ మంచిని చేసేందుకు పరిస్థితులు కూడా కలిసి వస్తాయని, అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ కళ్యాణలక్ష్మి, షాదీ తోఫా అని ఉద్ఘాటించారు.

 

వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకానికి పదో తరగతి ఉత్తీర్ణత, 18 సంవత్సరాలు, 21 సంవత్సరాల నిబంధన ఎందుకు పెట్టాలని నాతో చాలా మంది అన్నారని గుర్తు చేశారు. 10 తరగతి ఉత్తీర్ణత నిబంధన లేకపోతే మనకు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయని నాతో చాలా మంది అన్నారని, ఓట్లు, ఎన్నికలు అనేది సెకండరీ అని, లీడర్లుగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలని విజన్‌ అనేది చాలా ముఖ్యమని, ఈరోజు మనం వేసే ప్రతి అడుగులోనూ విత్తనం వేస్తున్నామని అన్నారు. 10వ తరగతి సర్టిఫికెట్‌ ఏరోజు అయితే మనం కంపల్సరీ చేస్తామో.. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలనే నిబంధన పెడతామో అప్పుడు బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోవడం, టెన్త్‌ సర్టిఫికెట్‌ నిబంధన వల్ల ప్రతి కుటుంబం కూడా తమ పిల్లలను చదివించడం కోసం ఇది కూడా మరింతగా ఊతమిచ్చే కార్యక్రమంలో భాగం అవుతుందని అన్నారు.

 

18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లికి ఆగాలి కాబట్టి.. పిల్లలను ఇంటర్మీడియట్‌ కూడా చదివిస్తారు, అమ్మ ఒడి పథకం ఇంటర్‌ వరకు కూడా వర్తిస్తుంది, కాబట్టి పిల్లలను ఇంటర్మీడియట్‌ వరకు పిల్లలను చదివించాక ఆ తరువాత విద్యా దీవెన, వసతి దీవెన రెండు పథకాలు కూడా జగనన్న ప్రభుత్వంలో అందుబాటులో ఉన్నాయనే ఆలోచన తడుతుందో అప్పుడు ఆ పిల్లలను గ్రాడ్యుయేషన్‌ వరకు చదివించేలా ఆ తల్లిదండ్రులు మోటివేట్‌ అవుతారని, పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేస్తే అప్పుడు ఒక జనరేషన్‌ మార్పు వస్తుందని, పిల్లల తలరాతలు మార్చే గొప్ప అస్త్రం చదువు అని పేదరికం నుంచి బయటపడే గొప్ప పరిస్థితి చదువుతో ఏర్పడుతుందని, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ పథకాన్ని మనం తీసుకువచ్చామని చెప్పుకోచ్చారు.

 

గత ప్రభుత్వంలో ఇదే,పథకానికి సంబంధించి 10వ తరగతి నిబంధన లేదని, ఇచ్చేది ఏదో అరకరగా ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొందని, 2018లో ఏకంగా పథకాన్నే నీరుగార్చారని విమర్శించారు. గత ప్రభుత్వంలో అర్హులందరికీ ఇచ్చే పరిస్థితి లేదని, ఎప్పుడు ఇస్తారో అంతకంటే తెలియదుని, సాయం చేయడంలో పారదర్శకత అంతకంటే లేదని, 2018 వచ్చేసరికి ఏకంగా చేతులు ఎత్తేశారని ఆరోపించారు. .

 

మనం చిత్తశుద్ధితో, మోటివేషన్‌తో, పారదర్శకతతో ప్రతి ఒక్కరికీ మంచి జరిగించాలని, ఏ ఒక్కరూ మిస్‌ కావొద్దనే తపనతో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల పరిశీలన తరువాత మరుసటి నెల నూతన వధూవరులకు సంబంధించిన వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు తల్లుల ఖాతాల్లోకి జమ చేసే పద్ధతిని తీసుకువచ్చామని అన్నారు.

 

“గత ప్రభుత్వంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే అది కూడా కొంతమందికే, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నుంచి.. ఈరోజు మన ప్రభుత్వంలో మైనార్టీ షాదీ తోఫా కింద రూ.1 లక్ష సాయంతో పాటు పిల్లలను చదివించడం కోసం 10వ తరగతి నిబంధన పెట్టాం. దివ్యాంగులకు రూ.1.5 లక్షల సాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40 వేలు ఇస్తే.. మన ప్రభుత్వంలో రూ.1 లక్ష అందిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్టీలకు రూ.50 వేలు మాత్రమే ఇస్తే.. మన ప్రభుత్వంలో రూ.1 లక్ష సాయం అందిస్తున్నాం.

గత ప్రభుత్వంలో బీసీలకు రూ.35 వేలు మాత్రమే ఇస్తే.. మనం రూ.50 వేలు అందిస్తున్నాం. కులాంతర వివాహాలకు మన ప్రభుత్వంలో రూ.1.25 లక్షల సాయం అందిస్తున్నాం. ఇవన్నీ చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులు పిల్లలను చదివించే దిశగా అడుగులు వేయించడం కోసం అడుగులు వేస్తున్న గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ద్వారా నూతన వధూవరులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను” అని సీఎం జగన్ అన్నారు

 

నాల్గవ విడతలో వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా అందిస్తున్న జంటల్లో 8,042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయని, ఇది నిజంగా గొప్ప మార్పునకు చిహ్నమని, ఇది ఇక్కడితో ఆగిపోకుండా రాబోయే నెలలు, సంవత్సరాల్లో 10 శాతం రిజిస్టర్‌ కావాలని తపన, తాపత్రయపడుతున్నాని సీఎం తన ఆకాంక్షను తెలిపారు.

Post midle

Comments are closed.