తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న నాయిని నర్సింహారెడ్డి కొన్నీ గంటల క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయనకు భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రామ్ నగర్ డివిజన్ కు కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు.
కరోనా సోకిన నాయిని, దాన్నుంచి కోలుకున్న తరువాత న్యుమోనియా బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. గడచిన వారం రోజులుగా ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉండగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ ను అమర్చి చికిత్సను అందించారు.
బుధవారం నాడు సీఎం కేసీఆర్ కూడా వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత నాయిని పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నాయిని మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Tags: Nayini Narsimha Reddy, kcr, Corona Passed Away
Comments are closed.