The South9
The news is by your side.
after image

పేద విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్య ప్రభుత్వ లక్ష్యం. సీఎం జగన్

*21-12-2022*

బాపట్ల జిల్లా, చుండూరు మండలం, యడ్లపల్లి గ్రామం.

*ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ విప్లవం*

పెత్తందారుల పిల్లలకేనా ఇంగ్లీష్ చదువులు.. పేద పిల్లలకు వద్దా?

విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని బాపట్లలో ప్రారంభించిన సీఎం జగన్

పేద విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్య ప్రభుత్వ లక్ష్యం. సీఎం జగన్

 

Post Inner vinod found

అందరికీ సమానమైన నైపుణ్యం ఉండకపోవచ్చు. కానీ అందరికీ సమానమైన అవకాశం దొరికితీరాలి. అది కల్పించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అంటూ జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన మాటలను సీఎం జగన్ గుర్తుచేశారు.

 

Post midle

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల భవితకు భరోసా ఇచ్చేలా.. పేద విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్య అందించాలనే ఉక్కు సంకల్పంతో మన బడి నాడు నేడు నుంచి మొదలు నేటి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో పనిచేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. పెత్తందారులు, ఉన్నత వార్గాలకే పరిమితమైన ఇంగ్లీష్ మీడియం చదువును ప్రతి పేద విద్యార్థికి అందించడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా కోర్టులకెళ్లి పేద విద్యార్థులకు చేయాలనుకుంటున్న మంచిని ఆపాలని చూస్తున్న కొందరిని చూస్తే బాధనిపిస్తుందని భావోధ్వేగం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవం తెస్తామని, వాటి ఫలితాలను ఆయా పేద కుటుంబాల, రాష్ర్టం వచ్చే 10 ఏళ్లలో అనుభవిస్తుందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ర్ట వ్యాప్తంగా 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్ల పంపిణీని సీఎం జగన్ బుధవారం నాడు ప్రారంభించారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో అందించనున్న ఈ ట్యాబ్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 1,466 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిపారు. తన పుట్టిన రోజున భావి తరాలకు సారథులైన విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆర్థిక స్థోమతతో పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశానని ఆ కుటుంబాల తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించి మన బడి నాడు నేడు పథకంలో విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు.

 

*పాఠశాల విద్యలో డిజిటల్ విప్లవం*

 

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టామని. తద్వారా సమాజంలో ఉన్న అంతరాలు తొలగి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు అందిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ చదువులు పేదలకు అందకూడదనే పెత్తందారీ భావజాలం చూస్తే వీరికి పేదలు ఎదగడం ఇష్టం లేదాన్న అనుమానం కలుగుతుందన్నారు. బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలని మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయన్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ట్యాబుల్లో ‘‘తెలుగు, ఇంగ్లీష్‌, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్‌లు అందిస్తున్నాం. క్లాస్‌ టీచర్‌ చెప్పే పాఠశాలకు ఈ ట్యాబ్‌లు సపోర్ట్‌గా ఉంటాయి అని సీఎం తెలిపారు. ‘‘పిల్లలకు నష్టం జరిగే కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో తొలగించాం. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ విలువ రూ.32 వేలు. ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి అందిస్తున్నాం. ఇంటర్నెట్ అవసరం లేకుండానే పాఠ్యాంశాలను విద్యార్థులు చూడొచ్చని సీఎం పేర్కొన్నారు.

 

‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మన పిల్లలు అంటే.. మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచిపేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీకూడా మనసారా కూడా కోరుకుంటారు. అలా కోరుకునే అనేక హృదయాలు రకరకాల కారణాల వల్ల అంటే తమ కులం వల్లనో, ఆర్థిక స్తోమత కారణంగానో సరిగ్గా చదివించుకోలేకపోతున్నామని వారు భావించినప్పుడు వారి మనస్సులు తల్లిడిల్లిపోతాయి. దీన్ని స్వయంగా నేను చూశాను.’’ అంటూ సీఎం జగన్ సభలో భావోద్వేగం వ్యక్తం చేశారు.

Post midle

Comments are closed.