The South9
The news is by your side.

అలా మాట్లాడినందుకు జైల్లో లబోదిబోమంటున్నాడు

post top

 

after image

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ మార్చి 14న పిఠాపురంలో జరగనుంది ఈ సభలో నిర్వహణ కమిటీలతో పాటు పిఎసి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు సమావేశమయ్యారు కాకినాడలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ సభ నిర్వహణపై కమిటీల దిశా నిర్దేశం చేశారు ఎన్నికల్లో విజయం సాధించాక జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ ను దూషించిన వారి గురించి ప్రస్తావించారు పవన్ అంటే నేతలను తిడితే హీరోలు కాదు జీరోలు అవుతారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడారు మనం చూశాం. నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో కూర్చుని లబోదిబోమంటున్నాడు ప్రభుత్వం మారినా కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారిని వదిలిపెట్టం వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేసే వారిపై బురద చల్లారని చూస్తే దిగజారిపోతారు పార్టీ నాయకుడిని కించపరిచిన ఎవరూ మాట్లాడరా జనసైనికులు వీర మహిళలు కచ్చితంగా ఖండించాలి అయితే దానిపై సరైన పద్ధతి ఎన్నుకోవాలి అని నాదెండ్ల వివరించారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.