టైము ప్లేసు బాగా ఎన్నుకొని,అమావాస్య రోజు నల్ల చొక్కా వేసుకొని జైలు దగ్గర పొత్తు పెట్టుకున్నారంటే ఇంక మీరే ఆలోచించుకోవాలి: మేకపాటి విక్రమ్ రెడ్డి

*సినిమా డైలాగులు వేసే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: అభివృద్ది అంటే స్వంత అభివృద్ది కాదు ప్రతి గడపలో అభివృద్ది*
*: నియోజకవర్గ సర్వతాముఖాభివృద్ది కోసం కృషి చేస్తున్నాం*
*తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష నుండి తప్పించుకోలేరని, తప్పు చేసిన వారి కోసం సినిమా డైలాగులు చెప్పే వారి గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని, ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో వారికి తెలియని వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.*
*అనంతరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు తెలిపి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.*

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నందవరం సచివాలయం పరిధిలో ఇప్పటి వరకు రూ.18 కోట్ల మేర అభివృద్ది, సంక్షేమ పథకాలను అందచేయడం జరిగిందని వివరించారు. గత ప్రభుత్వంలో ఇందులో 10 శాతం కూడా అందచేసి ఉండరని వివరించారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన అనంతరం ప్రతి ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందచేయడం జరిగిందని అన్నారు.*

*గ్రామస్థాయి పరిపాలన తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని, ప్రతి గడపలో అందరూ మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరమైన హైలెవల్ కెనాల్ నిర్మాణం విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రెండు సంవత్సరాల కాలంలో దానిని పూర్తి చేస్తామని తెలిపారన్నారు. భూసేకరణ, నష్టపరిహారం తదితర పనులన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు.*
*నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే రెండుమార్లు కలెక్టర్ ను కలిసి సమీక్షలు నిర్వహించడం జరిగిందని, దీని ద్వారా 26 వేల నోషనల్ ఖాతాల సమస్యలతో పాటు 8 వేల సాదాబైనామా కేసులు పరిష్కారమయ్యాయని, 7 వేల చుక్కల భూముల సమస్యలను పరిష్కరించేందుకు రెండవ విడత కూడా సిద్దం చేసినట్లు వివరించారు. రానున్న 2, 3 నెలల వ్యవధిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.*
*పారిశ్రామికంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని, బద్వేల్ లోని సెంచూరియన్ ప్లైవుడ్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడం జరిగిందని, నియోజకవర్గ యువతకు 500 మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారన్నారు. తాము సైతం యువత శిక్షణ అందచేసి వారు ఉద్యోగాలు సాధించే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 2వ తేది జాబ్ మేళా సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నారంపేటలో త్వరలో పరిశ్రమ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.*
*నవంబర్ 12వ తేది రైతు సదస్సు నిర్వహించి నియోజకవర్గంలో రైతులకు లాభాయక వ్యవసాయంపై నిపుణుల ద్వారా శిక్షణ అందించే విధంగా, వారిని మరింత ప్రోత్సహించే విధంగా ఈ సదస్సు నిర్వహిస్తామని అన్నారు.*
*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ది చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రిపై ఇటివల కాలంలో ప్రతిపక్ష నాయకులు రాజకీయ కక్ష సాధింపు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఐదు సంవత్సరాల పాటు దర్యాప్తు అనంతరమే అరెస్ట్ లు చేయడం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగిందని వివరించారు.*
*కొంత మంది ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ది జరగడం లేదంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారని, అభివృద్ది అంటే స్వంత అభివృద్ది కాదని, ప్రతి గడపలో అభివృద్ది జరగడమేనని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ది చెందిన విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసునన్నారు. అభివృద్ది గురించి మాట్లాడాలంటే నేరుగా తనతోనే ఓపెన్ డిబెట్ లో మాట్లాడవచ్చునని పేర్కొన్నారు.*
*పొత్తు ఏం కొత్తది కాదని, 10 సంవత్సరాల నుంచి నడుస్తుందని, గతంలో ఓట్లను చీల్చేందుకు సైతం ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ కలిసి పోటి చేస్తామని ప్రకటించేందుకు సమయం అవసరం కావడంతో ఇప్పుడు ఇలా పొత్తు పెట్టుకుంటున్నామని బహిరంగంగా చెప్పారన్నారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని అన్నారు.*
*వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ*
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నందవంలో పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి వైఎస్సార్ ఆసరా కింద రెండు గ్రూపులకు మంజూరు అయిన నగదు చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన శ్రీ మహాలక్ష్మి గ్రూపుకు రూ.2.213 లక్షలు, లక్ష్మిదేవి గ్రూపుకు రూ.5.25 లక్షలు నగదు మంజూరు కావడంతో ఆ నగదు చెక్కులను ఎమ్మెల్యే వారికి అందచేశారు.*

Comments are closed.