The South9
The news is by your side.
after image

స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే.. ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు: సీఎం జగన్.

post top

తేదీ: 16-09-2023*

*స్థలం: నిడదవోలు*

 

స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే.. ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు: సీఎం జగన్*

*అవినీతిని ప్రశ్నించని పవన్ ములఖత్ ముసుగులో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకున్నారు*

45 ఏళ్లుగా దోపిడీనే చంద్రబాబు రాజకీయం.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు అండ్ కో బుకాయింపులు*

 

*”వైఎస్సార్ కాపు నేస్తం” నాలుగో విడత కింద 3,57,844 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.536.77 కోట్ల నిధులు జమ*

 

 

స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని, ఫేక్ అగ్రిమెంట్ తో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ ఖజానా దోచేశారని సీఎం జగన్ విమర్శించారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత నిధుల విడుదల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చంద్రబాబు ఒక ఫేక్‌ అగ్రిమెంట్‌ సృష్టించి ప్రభుత్వ నిబంధనలు అన్నింటిని కూడా సాక్షాత్తు చంద్రబాబే పక్కన పెట్టించి చివరికి ఆ కంపెనీయో మాకు రూ.371 కోట్లు దోచేసారని విమర్శించారు. ఆ అగ్రిమెంట్‌తో మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినా, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ అధికారులు స్కిల్‌ స్కామ్‌లో రూ.371 కోట్లు కొల్లగొట్టిన దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసినా ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ కు కనిపించదని విమర్శించారు. ఈ స్కిల్‌ స్కాం సూత్రదారి, పాత్రదారి చంద్రబాబే అని సాక్షాధారాలు ఉన్నా చంద్రబాబే స్వయంగా ఈ ఫేక్‌ అగ్రిమెంట్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు డబ్బులు ఇవ్వవద్దని అడ్వైజ్‌ చేసినా ఒత్తిడి తీసుకువచ్చి, సంతకాలు పెట్టి ఆ డబ్బును డొల్ల సూట్‌కేసు కంపెనీలకు ఎలా మళ్లించారో ఈడీనే నిర్ధారించిందన్నారు. ఈ కేసులో చంద్రబాబు పీఏ ఇంకో కేసులో అడ్డగోలుగా సెల్‌ఫోన్‌ చాట్‌తో ఈమెయిల్‌లో దొరికిపోయాడని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు స్కిల్ కేసుపై కోర్టులో 10 గంటలు వాదనలు విన్న తరువాత కోర్టును చంద్రబాబును రిమాండుకు పంపినా.. ఇంత బాహటంగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించరని ఏద్దేవా చేశారు. ఎల్లోమీడియా ఈ నిజాలను చూపించదని సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పు చేసినా నిసిగ్గుగా సపోర్టు చేస్తున్నారని విమర్శించారు.

 

 

Post midle

‘వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం’ నాలుగో విడతలో భాగంగా బటన్‌ నొక్కి రూ.536.77 కోట్ల నిధులను సీఎం జగన్ లబ్ధి­దారుల ఖాతాల్లోకి జమ చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లంద‌రి ప్ర‌భుత్వ‌మ‌ని సీఎం జ‌గ‌న్ ఉద్ఘాటించారు. ఏ ప్రభుత్వం కూడా వైయ‌స్ఆర్ కాపు నేస్తం కార్యక్రమం అమలు చేయలేదని, కులం, మతం, రాజకీయాలు చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామ‌న్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డ‌బ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ‘ వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన నిరుపేద మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోందని సీఎం తెలిపారు. నేడు అందచేసిన సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోందని సీఎం పేర్కొన్నారు. అంటే ఒక్కో పేద కాపు అక్క చెల్లెమ్మకు నాలుగేళ్ళ కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000 అని ప్రతి నిరుపేద అక్కచెల్లెమ్మ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న తపనతోనే ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

 

సామాజిక న్యాయం అన్నది ఒక నినాదంగా కాకుండా విధానంగా మార్చుకున్న ప్రభుత్వం మనదని, కాపు సోదరులకు రెండు క్యాబినెట్లో నలుగురు చొప్పున మంత్రులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. కాపు సోదరుడికి నా పక్కన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నానని చెప్పారు. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో కాపు సోదరుడు కనిపిస్తాడని చెప్పడానికి గర్వపడుతానని అన్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో కాపులకు ఏకంగా 12 శాతం ఇచ్చాం. మనందరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. కులం, మతం చూడటం లేదు. రాజకీయాలు చూడటం లేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడటం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. అర్హత ఉంటే చాలు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. అక్షరాల 2.35 లక్షల కుటుంబాలకు నేరుగా బటన్‌ నొక్కి పంపించిని సొమ్ము, ఇందులో కాపులకు అందించిన మొత్తం అక్షరాల రూ.22,333 కోట్లు అని సవినయంగా సగర్వంగా తెలియజేస్తున్నాను.

 

“దురదృష్టం ఏమిటంటే..ఇన్ని దొంగతనాలు చేసినా ..ఎంతటి దోపిడీ చేసినా..ఎన్ని వెన్నుపోటులు పొడిచినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పిన వారు ఇంతకాలం లేరు.”- సీఎం జగన్

 

45 ఏళ్లుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను వంచించాడు. ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుబావుడి గురించి నాలుగు మాటలు చెబుతాను.

 

Post Inner vinod found

చట్టం ఎవరికైనా ఒక్కటే ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న నాయకులకు అదే శిక్ష పడాలని సీఎం జగన్ . ఇలా చెప్పే వారు ఇంతకాలం లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దొంగల ముఠా సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం దుయ్యబట్టారు.

 

*ఆధారాలతో సహా అడ్డంగా దోరికిపోయినా ఒటు నోటు కేసులో చంద్రబాబు బుకాయింపులు*

 

చంద్రబాబు దొంగగా దొరికినా కూడా అడ్డంగా, నిలువునా దొరికినా కూడా బుకాయిస్తాడని సీఎం ధ్వజమెత్తారు. నల్లధనం ఇస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపులతో దొరికినా కూడా , ఆ వాయిస్‌ చంద్రబాబే అని తేల్చినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ అర్థమైన కూడా బాబు చేసింది నేరమే కాదని, కానే కాదని వాదించడానికి 10 కోట్ల ప్రజల గంతలు కట్టడానికి దొంగతనాల్లో వాటాదారులు వెంటనే రెడీ అయ్యారు కానీ, అర డజన్‌ చానల్స్, రెండు పత్రికలు అండగా నిలిచారని సీఎం గుర్తు చేశారు.

 

*ప్రశ్నించాల్సిన నోళ్లు మూగబోయయా?*

 

“నల్ల డబ్బు ఇస్తూ దొరికినా, ఫారెన్సిక్స్‌ ల్యాబ్‌లు సర్టిఫికెట్లు ఇచ్చినా నీతి,న్యాయం, ధర్మం ఉంటే ఎటువైపు నిలబడాలి. చట్టం వైపా..దొంగల వైపు నిలబడలా? ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా..ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఎల్లోమీడియా నిజాన్ని చూపించరు, నోరెత్తరు, మాట్లాడరు. పైగా నిసిగ్గుగా ఆ పని సబబే అని మాట్లాడుతారు. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామో ఆలోచన చేయండి.” – సీఎం జగన్

 

*100కోట్ల ప్రజా ధనం ఎక్కడికి పోయింది?*

 

ఈ రోజు ఈ వందల కోట్ల ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయిందని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును కాని మరెవ్వరిని అరెస్టు చేసిన రాజకీయ నాయకులు నోరెత్తటంలేదని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు స్పందించకపోటానికి కారణం అందరూ దొంగవాళ్లే కావటమని, వాటాలు పంచుతిన్నారు కాబట్టే వారు నోరెత్తడం లేదని ఆరోపించారు.

 

*ములాఖత్ ముసుగులో మిలాఖత్ అయ్యి పొత్తు పెట్టుకున్నారు*

 

“ఇంత పెద్ద సొమ్ము ఎలా దోచేశారు. ఎవరి జేబుల్లోకి ఆ డబ్బులు పోయాయి. దోచేసిన వాళ్లకు జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలని ప్రశ్నించాల్సిన ఈ వ్యక్తులు ములాఖత్‌లో మిలాఖత్‌ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏమవుతాయో ఆలోచన చేయండి.”- సీఎం జగన్

 

“మీ బిడ్డ ప్రభుత్వం 2019లో ఏర్పడింది. దాదాపుగా గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్‌ ఉందో అదే బడ్జెట్‌ మీ బిడ్డ ప్రభుత్వంలోనూ ఉంది. వారికి ఎంత ఆదాయం ఉందో, మీ బిడ్డ ప్రభుత్వానికి అంతే ఆదాయ మార్గాలు ఉన్నాయి.పైగా మీ బిడ్డ పరిపాలనలో రెండేళ్లు కోవిడ్‌ కూడా వచ్చింది. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. అయినా కూడా అదే ఆదాయం, అదే బడ్జెట్‌..అప్పుల్లో గ్రోత్‌ రేట్‌ కూడా అప్పటి కన్నా మీ బిడ్డ హయాంలో తక్కువ. మీ బిడ్డ అక్షరాల రూ.2 లక్షల 35 వేల కోట్ల రూపాయలు 52 నెలల కాలంలోనే నేరుగా బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేశాడు. ఎక్కడ లంచాలు లేవు. వివక్ష లేదు. మీ బిడ్డ చేయగలిగాడు. వారు చేయలేకపోయారు. ఇదే మీ బిడ్డ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడా..గమనించమని కోరుతున్నాను.”- సీఎం జగన్

 

వీళ్లందరికీ కూడా కండకావరం ఏంటంటే మాకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడి సపోర్టు ఉందనే అహంకారం కాబట్టే కాబట్టి మేం దోచేసినా కూడా పంచుకున్నా కూడా ఎవరూ మాట్లాడరు అనే ధీమా వారికి ఉందని సీఎం విమర్శించారు. కానీ మీ బిడ్డకు వీరు లేరని, మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్నే..మధ్యలో ఎవర్ని నమ్ముకోలేదని ఉద్ఘాటించారు. జరుగబోయే ఈ కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం, ధర్మం మీ బిడ్డ పక్షాన ఉందని, అన్యాయం,మోసం అటువైపు ఉన్నాయని, మీ బిడ్డకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడు సపోర్టు చేయకపోవచ్చని, కానీ మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా అన్నది కొలమానంగా తీసుకోవాలని. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా మారాలని సీఎం జగన్ ప్రజల కోరారు.

Post midle

Comments are closed.