The South9
The news is by your side.

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ మదిలో కొత్త పేరు -మాజీ సీ .ఎస్. రత్నప్రభ?

post top

తిరుపతి ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీల కు ఒక అగ్ని పరీక్ష లాగా మారాయి. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైస్సార్సీపీ అధికారకంగా ప్రకటించకపోయిన గురుమూర్తి పేరు ఖరారు అని వారి పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అలానే టీడీపి పనబాక లక్ష్మీ పేరు ను ఖరారు చేసేరు. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(R.P.I) పార్టీ అభ్యర్థి గా జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి పేరు ని ఖరారు చేసేరు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన అభ్యర్థి వేటలో ముమ్మరంగా ఉంది. బీజేపీ అభ్యర్థి జనసేన ఉమ్మడి అభ్యర్థి ని రంగంలోకి దించాలని చూస్తన్నా బీజీపీ అభ్యర్థి గా వాళ్ళ వ్యక్తి నే నియమించాలని చూస్తుంది బీజేపీ అధిష్టానం. గతంలో దాసరి శ్రీనివాస్ ,భాస్కర్ రావు తదితర పేర్లు వినిపించినా ఇంకా ఎవరి మీద మొగ్గు చూపలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సి. యస్. రత్న ప్రభ ని రంగంలోకి దించాలని బీజేపీ అధిష్టానం చూస్తుంది అని అంటున్నారు?
రత్నప్రభ నేపథ్యం                                                                                                                       1981 కర్నాటక క్యాడర్ కి చెందిన రత్నప్రభ ఆంద్రప్రదేశ్ లో కూడా పనిచేసారు. గతంలో జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఈమె ని ముద్దాయి గా పేర్కొంది సీబీఐ.ఇందుటెక్ జెన్ కో కి అనుమతి నిచ్చిన వ్యవహారం లో సీబీఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అయితే దీనిని హైకోర్టు లో సవాల్ చేసి క్లీన్ చిట్ తెచ్చుకున్నారు రత్నప్రభ తర్వాత కాలంలో సొంత క్యాడర్ కర్ణాటక కి వెళ్లి యడ్యూరప్ప సర్కారులో సీఎస్ గా కూడా పనిచేసారు రత్నప్రభ.ఈ నేపథ్యంలో ఈమె పేరు ను జనసేన అంగీకరిస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తానికి బీజేపీ, జనసేన అభ్యర్థి విషయంలో ముమ్మరంగా ఉన్నారని చెప్పాలి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.