south9 ప్రతినిధి
చాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ అవుట్
పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ షెడ్యూల్ వేదికలపై ఐసీసీ కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర ప్రకటన చేసింది చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లోనే జరిగేటైతే భారత జట్టు పాల్గోనదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ స్పందించారు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వ్యవహారంపై బీసీసీఐ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసిందని బిసిసిఐ చెప్పినట్టుగానే భారత జట్టు పాకిస్తాన్ వెళ్ళబోవడం లేదని తెలిపాడు బీసీసీఐ నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని పేర్కొన్నారు పాకిస్తాన్లో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళన చెందుతుందని జై శ్వాల్ చెప్పారు అందుకే టీమిండియాను పాకిస్తాన్ పంపించడం లేదని అన్నారు కాగా టీమిండియా పాకిస్తాన్ వెళ్లడం లేదన్న ప్రకటన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్ టోపీ నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి హైబ్రిడ్ మోడల్ అంటే కొన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో మరికొన్ని మ్యాచ్లను ఇతర దేశాలలో నిర్వహిస్తారు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మాత్రం దీనికి అంగీకరించేది లేదని తెగేసి చెబుతోంది ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన ఐసీసీ కీలక సమావేశం రేపటికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి