The South9
The news is by your side.

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా! రాజేంద్ర‌ప్ర‌సాద్‌

post top

south 9 ప్రతినిధి :

after image

తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించానని సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు చేతిలో డబ్బులు లేక దాదాపు మూడు నెలలు అన్నం తినలేదని తెలిపారు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు స్కూల్ టీచర్ అయినా తన తండ్రి ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారని సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నానని చెబితే అసహనం వ్యక్తం చేశారని చెప్పారు నీ ఇష్టానికి వెళ్తున్నావు సినిమాల్లో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దని అన్నారని తెలిపారు ఆయన మాటలు తన‌పై ఎంతో ప్రభావం చూపాయచాలనిని చెప్పారు ఆ తర్వాత తాను మద్రాసు వచ్చి ఫిల్్మ ఇన్స్టిట్యూట్లో చేరానని గోల్డ్ మెడలు సాధించాన‌ని తెలిపారు అయితే సినిమా అవకాశాలు మాత్రమే రాలేదని చెప్పారు ఇంటికి తిరిగి వెళితే ఇంటికి రావ‌ద్దు అన్నాను కదా ఎందుకు వచ్చావు అని నాన్న అన్నారని ఎంతో బాధతో వెంటనే మద్రాస్ కు వచ్చాను అని తెలిపారు ఒకరోజు నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకి వెళ్తే అక్కడ ఏదో గొడవ జరుగుతుందని తన రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన తనను డబ్బింగ్ థియేటర్ థియేటర్కు తీసుకుని వెళ్లారు. ఒక సీనుకు తనతో డబ్బింగ్ తెప్పించారని అది ఆయనకు బాగా నచ్చడంతో రెండో సీనుకు డబ్బింగ్ చెప్పించార‌ని తెలిపారు అలా డబ్బింగ్ కెరీర్ మొద‌లైంది. మ‌ద్రాస్లో ఇల్లు కట్టుకున్న అని చెప్పారు ఆ తర్వాత దర్శకుడు వంశీ తో పరిచయం కావడం ఆయన సినిమాలలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాన‌ని తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.