సౌత్ 9 ప్రతినిధి :
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏం చేశారని మీకు శాలువా కప్పాలని ఆయన ప్రశ్నించారు విద్యుత్ వ్యవస్థను నాశనం చేసినందుకు మీకు శాలువా కప్పాలా అని అన్నారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు మీకు శాలువా కప్పాలా అని ప్రశ్నించారు వ్యవస్థలను నాశనం చేసినందుకు మీకు శాలువా కప్పాలా అని ఎద్దేవా చేశారు దేశంలోనే అతిపెద్ద అవినీతి సామ్రాట్ అని సన్మానం చేయాలా అని ప్రశ్నించారు విద్యుత్ వ్యవస్థ పై లక్ష కోట్లు అప్పు చేశారని గొట్టిపాటి మండిపడ్డారు జగన్ అవినీతి గతంలో రాష్ట్రం దాటితే ఇప్పుడు ఏకంగా దేశం దాటిందని అన్నారు జగన్ నిర్వాకంతో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని దుయ్యపట్టారు