
కష్టంగా కాదు ఇష్టంగా చదవాలి… యండమూరి వీరేంద్రనాథ్.
నెల్లూరు
డిసెంబరు 3 (సౌత్ 9)
విద్యార్థినీ విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలని కష్టంగా కాక ఇష్టంగా చదవాలని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు.
వినోద్ ఫౌండేషన్ స్థాపించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఉద్దేశించి చదువుతోపాటు శారీరక మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.
బ్రతికున్న తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వదిలేసే రోజుల్లో
చనిపోయిన తన తమ్ముడు పేరుమీద వినోద్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్న
మన పాటి చక్రవర్తిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు.
విద్యార్థినీ విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందజేశారు.

విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్
విజయభాస్కరరావు మాట్లాడుతూ….
ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతంగా చదువుకోవాలని అన్నారు.
చదువు పట్ల ఆసక్తి కనపర్చాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి రావాలంటే విద్య ఒక్కటే మార్గమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
జిల్లా జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్ ఐఏఎస్,
ఐ ఆర్ ఎస్ ఆఫీసర్ సైలేంద్రబాబు, డాక్టర్ సుధీర్ , apju రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు,వినోద్ ఫౌండేషన్ సభ్యులు,రాజు,అనీల్,మున్నా,
జగదీష్, నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నవరస కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు వీక్షకులను అలరించాయి.
Comments are closed.