The South9
The news is by your side.

సొంత సంస్థ కేఎంసీ నుంచి రూకోటిన్నర సీఎమ్ఆర్ఎఫ్ కి ప్రకటించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

post top

 

తేదీ: 13-05-2021,
అమరావతి.

రాష్ట్ర ప్రజలకు అండగా పరిశ్రమలు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఆక్సిజన్ పాలసీ, ఆక్సిజన్ తయారీ పాలసీ తీసుకువస్తాం

సీఎస్ఆర్ నిధుల ద్వారా కరోనా విపత్తును ఎదుర్కోవడానికి భాగస్వామి అవ్వాలని పిలుపునిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి

తన బాధ్యతగా సొంత సంస్థ ‘కేఎంసీ’ నుంచి రూ.కోటిన్నర సీఎమ్ఆర్ఎఫ్ కి ప్రకటించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

*సీఎస్ఆర్ నిధులను ప్రభుత్వానికి అందించాలనుకునేవారు సీఎమ్ఆర్ఎఫ్ కి ఇవ్వొచ్చు లేదా పరిశ్రమలున్న స్థానిక ప్రజలు, నాయకులు, ఆసుపత్రిలో వసతులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు తరహా సదుపాయాల కల్పన కు వినియోగించవచ్చు*

Post midle

*మంత్రి పిలుపుమేరకు సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తోన్న సూక్ష్మ, చిన్న మధ్యతరహా, భారీ పరిశ్రమలు*

*స్వేచ్ఛగా సేవకు ముందుకొచ్చి పరిశ్రమలు చేస్తున్న ప్రతి పనిని మానిటరింగ్ చేసేలా పరిశ్రమల శాఖకు మంత్రి ఆదేశం*

*’సామాజిక బాధ్యత’ను చాటిన పరిశ్రమలను గుర్తించి గౌరవించి చిరు సత్కారం, సర్టిఫికేషన్ అందిస్తామని మంత్రి మేకపాటి వెల్లడి*

*రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల పరిశ్రమల ప్రతినిధులతో నెల్లూరు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన పరిశ్రమల శాఖ మంత్రి*

*పరిశ్రమలకు కోవిడ్-19 మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో జీవో.ఆర్టీ నంబర్ 68 అమలు, ఉద్యోగులు,కార్మికుల రక్షణ , ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తి , సరకు రవాణాలో వస్తున్న ఇబ్బందులు, అత్యవసరాల తయారీ, ఫార్మా పరిశ్రమల వంటి అంశాలపై ప్రధానంగా చర్చ*

*పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి : పరిశ్రమల శాఖ డైరెక్టర్*

*ఒక పీఎస్ఏ ప్లాంట్ ఏర్పాటుకు మామూలుగా నెల రోజులు పడుతుంది. కానీ మెటీరియల్ కొరత వల్ల ప్రస్తుతం కనీసం 3 నెలల సమయం : సుబ్రహ్మణ్యం జవ్వాది*

*రాష్ట్రంలో నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ కు మార్చే 7 ప్లాంట్ ల ఏర్పాటుకు కసరత్తు*

*మంత్రి మేకపాటి పిలుపు మేరకు రూ.కోటి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు వెల్లడించిన అమరరాజ బ్యాటరీ సంస్థ ప్రతినిధి*

*చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా 500 బెడ్ల ఏర్పాటుకు కషి చేస్తామని వెల్లడి*

*సాంకేతిక సహకారంలోనూ భాగస్వామ్యమవుతామని వెల్లడించిన అమరరాజ బ్యాటరీ పరిశ్రమ ప్రతినిధి విజయానంద్*

*సీఎస్ఆర్ నిధుల ద్వారా ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చిన అనేక పరిశ్రమలు*

*సీఎస్ఆర్ నిధులకు సంబంధించిన ఏ విషయంలోనైనా సహకారం,విరాళం, వివరాలకోసం పరిశ్రమలు సంప్రదించడానికి “స్టేట్ లెవల్ సీఎస్ఆర్ సెల్” ఏర్పాటు చేసిన పరిశ్రమల శాఖ డైరెక్టర్*

after image

*పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్లు ఏఏఎల్ పద్మావతి(9640909844), వీ.ఆర్ విజయరాఘవ నాయక్(9985539983) ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు*

*మరిన్ని వివరాల కోసం పరిశ్రమల శాఖ అధికారిక వెబ్ సైట్ లోని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ ల మెయిల్ ద్వారా కూడా సంప్రదించగలరు*

*e-Mail Id: vijaya.naik@gov.in, director.industry@ap.gov.in; padhma.arumilli@gov.in
splcs-inds@ap.gov.in*

*పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కోలివుడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ రోగులకు బెడ్ ల ఏర్పాటు, ఆక్సిజన్ గా మార్చే ప్లాంట్లు స్థాపన, ఆక్సీజన్ క్రయోజెనిక్ ట్యాంకర్ల ఏర్పాటు, పొరు దేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతుల తరహా విషయాలలో భాగస్వామ్యానికి స్వతంత్రంగా ముందుకు వచ్చిన రాష్ట్రంలోని పరిశ్రమలు*

*విపత్తును ఎదుర్కోవడంలో స్వతంత్రంగా ముందుకు వస్తున్న పరిశ్రమలకు అభినందనలు తెలిపిన మంత్రి మేకపాటి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి కరికాల*

*5 లీటర్ల సామర్థ్యం కలిగిన 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వారంలోగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీకి అందించనున్నట్లు వెల్లడించిన హిందుస్థాన్ యూనిలివర్ పరిశ్రమ ప్రతినిధి సతీష్ కుమార్*

*ఎమ్ఎస్ఎమ్ఈలు కూడా విపత్తును ఎదుర్కోవడంలో తోడ్పాటునందిస్తున్నాయని వెల్లడించిన ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి*

*కర్నూలులోని రామ్ కో కంపెనీ స్థానిక పీహెచ్ సీల వసతులు, కోవిడ్ ప్రభావం ఉన్న ప్రాంతాలకు శానిటైజేషన్ విషయంలో సహకరిస్తున్నట్లు వెల్లడి*

*రూ.కోటి 11 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించిన సీసీఎల్ ప్రాడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి దుగ్గిరాల, మరింత సహకారానికి ముందుకు వస్తామని వెల్లడి*

*చిత్తూరులోని తమ కంపెనీ ఉద్యోగులకు వాక్సిన్ అందించడమే కాకుండా, సీఎస్ఆర్ నిధులు ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపిన డిక్సన్ ప్రతినిధి పంకజ్*

*రూ.75 లక్షల సిఎస్ఆర్ నిధులను ప్రభుత్వానికి అందిస్తామని పేర్కొన్న చిత్తూరు జిల్లా లోని డిక్సన్ కంపెనీ*

*100 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు ఏర్పాటు చేస్తున్నాం, 15వేల శానిటైజ్ బాటిళ్లను అందించాం, 10 లక్షలు విరాళంగా ఇచ్చామన్న ఓ కంపెనీ ప్రతినిధి గ్రోయెల్*

*విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అన్ని విధాల సహకారం : శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి*

*ఆగస్ట్ నుంచి ప్రతి రోజూ 140 టన్నుల ఆక్సిజన్ సరఫరా అందించేందుకు సన్నద్ధం : రవి సన్నారెడ్డి*

*వెనుకబడిన సత్యవేడు ప్రాంతం సహా శ్రీసిటీ పరిసర ప్రాంతాలకు కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం*

*గతంలోనే సీఎస్ఆర్ నిధుల నుంచి సీఎమ్ఆర్ఎఫ్ కు రూ.2 కోట్ల అందించామని శ్రీసిటీ ఎండి*

*ఇదివరకే నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ గా మార్చే విధానానికి ప్రయత్నం చేస్తున్నాం : నాగార్జున అగ్రిటెక్ ప్రతినిధి సీవీ రాజులు*

*పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులను ఫ్రంట్ లైన్ గా గుర్తించి వారికి ప్రాధాన్యతల వారీగా వాక్సిన్ అందించడానికి కృషి*

*పరిశ్రమలు వ్యాక్సిన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా సరే, ప్రభుత్వం పరంగా వాక్సిన్ కార్యక్రమంపై సహకరించడానికి సిద్ధమని వెల్లడించిన సుబ్రహ్మణ్యం జవ్వాది*

*ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు , పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ వీ.ఆర్.వీ.ఆర్ నాయక్, 13 జిల్లాల పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, అధికారులు, ప్రభుత్వ సలహాదారులు లంకా శ్రీధర్, రాజీవ్ కష్ఱ, ఏపీపీపీసీబీ అధికారి రవీంద్రనాథ్, సీఐఐ ఛైర్మన్ రామకష్ణ, ఫిక్కీ , భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,జేఎస్ డబ్ల్యూ ప్రతినిధి, భారతి సిమెంట్, సీసీఎల్ ప్రాడక్ట్స్ ఇండియా లిమిటెడ్, కోల్గెట్ ఫామోలివ్ ప్రతినిధి సురేందర్ శర్మ, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ప్రతినిధి సతీష్,పియల్ డిస్టిలరీ, రామ్ కో, భారతి సిమెంట్ ప్రతినిధులు, అగ్రిటెక్ ప్రతినిధి సీవీ రాజులు,అమరనాథ్ బ్యాటరీ సంస్థ ప్రతినిధి విజయానంద్, ఇతర పరిశ్రమలకు చెందిన 230 మంది ప్రతినిధులు*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.