The South9
The news is by your side.

జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది: స్వరూపానందేంద్ర

post top
  • రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించడం హర్షణీయం
  • సీబీఐ విచారణలో కుట్ర కోణం బయటపడే అవకాశం ఉంది
  • సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారు

అంతర్వేది రథం దగ్ధం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు సీబీఐ విచారణను కోరుతూ హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని చెప్పారు.

సీబీఐ విచారణ ద్వారా అసలైన దోషులు, కుట్ర కోణం బయటపడే అవకాశం ఉందని చెప్పారు. ఘటనకు సంబంధించిన సూత్రధారులు, పాత్రధారులు అందరూ బయటకు వస్తారని తెలిపారు. టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక అద్భుతమని… ఇప్పుడు అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని కితాబునిచ్చారు.

after image
Tags: Jagan, YSRCP, Antarvedi, Swaroopanandendra Saraswati

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.