- ప్రింట్ చేయని పత్రికల ద్వారా సమాచార శాఖలో కోట్లు దండుకున్న అడ్వటైజ్మెంట్ (Advertisement)లపై ACB, CID ఎంక్వైరీ చేయాలి
- జర్నలిస్టుల సమస్యలపై సీఎం జగన్ చొరవ చూపాలి మచ్చా రామలింగారెడ్డి
- రాష్ట్ర అధ్యక్షులు
- ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (A.P.J.D.S) డిమాండ్.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని కొందరు అధికారులు అమలు చేస్తున్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్ లు రెన్యువల్ చేయకుండా కొత్తవి ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– జర్నలిస్టులకు అక్రిడేషన్ లు డిసెంబర్ వరకు రెన్యువల్ చేయాలి లేదా కొత్త అక్రిడేషన్ లు వెంటనే ఇవ్వాలి.
?ఈరోజు అనంతపురం నగరంలోని రోడ్డు భవనాల అతిథిగృహంలో మచ్చా రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
?సమాచార శాఖ 48 గంటల్లోపు అక్రిడేషన్ సమస్యని పరిష్కరించాలని.
-కొత్త కార్డులు ఇవ్వడానికి వీలుకాకపోతే పాత కార్డులను రెన్యూవల్ చేయాలి.
-అక్రిడేషన్ల కోసం జర్నలిస్టులు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా సమాచార శాఖ కమిషనర్ వెంటనే స్పందించాలి.
?గత ప్రభుత్వంలో మార్కెట్లోకి రాని ఏపీ, తెలంగాణ పత్రికలకు కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో కట్టబెట్టారు. పెద్ద ఎత్తున జరిగిన దుర్వినియోగం పై ACB, CID చే విచారణ చేయించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి.
?జర్నలిస్టుల సంక్షేమం కోసమే పుట్టామని చెప్పుకుంటున్న జర్నలిస్ట్ సంఘాలు అక్రిడేషన్లపై నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు.
-ఇదేనా జర్నలిస్టుల సంక్షేమం అంటే.. జర్నలిస్టులు ఇబ్బంది పడుతుంటే తమ యూనియన్లకు కమిటీలో ప్రాధాన్యత కావాలని పోరాటం చేయడం అన్యాయం.
?రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టు సోదరులందరూ ఆలోచించాలని స్వప్రయోజనాల కోసం యూనియన్ల ముసుగు వేసుకున్న వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు.
?రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు యూనియన్లకు గుర్తింపునివ్వాలని అన్ని కమిటీలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
?యూనియన్లు ఇచ్చిన సభ్యత్వ మీద లేబర్ కమిషనర్ సమాచార శాఖ కమిషనర్లు ఎంక్వయిరీ చేయాలని అందులో నిజమేనా సభ్యత్వం ఏదో గుర్తించాలని మచ్చా డిమాండ్ చేశారు.. జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టకుండా చూడాలని కోరారు.
?రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేయాలని JAC ఏర్పాటు చేస్తామని, అన్ని సంఘాలు కలిసి పోరాటం చేసి జర్నలిస్టుల అక్రిడేషన్లు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, చిన్న పత్రికల అడ్వర్టైజ్మెంట్లు పై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మచ్చా అన్నారు..
?సమాచార శాఖ అన్ని పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ సమానంగా ఇవ్వాలని చిన్న పత్రికలకు బడ్జెట్లో 30 శాతం కేటాయించాలని అవి కూడా రాష్ట్రంలో వచ్చే చిన్న పత్రికలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
?గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై దృష్టిపెట్టి జర్నలిస్టులను ఆదుకోవాలని జర్నలిస్టులకు అండగా ఉండాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.
?రాష్ట్రంలోని జర్నలిస్టులు రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత సమాచార శాఖ అధికారులదే అని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.
?విలేకర్ల సమావేశంలో దామోదర్ రెడ్డి, విజయరాజు శ్రావణ్, షాకిర్, పవన్, నాయక్, చలపతి, జానీ తదితరులు పాల్గొన్నారు.
?ANDHRA PRADESH JOURNALIST DEVELOPMENT SOCIETY, (A.P.J.D.S.) ?
Comments are closed.