ఆర్. పి. ఐ పార్టీ రొండు రాష్ట్ర ల కన్వీనర్ పేరం శివనాగేశ్వర రావు గౌడ్, ఆర్. పి. ఐ. జిల్లా అధ్యక్షుడు sk మాబు నెల్లూరు క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ డా” బాబా సాహెబ్ అంబెడ్కర్ స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరుపున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గా జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి పేరు ఖరారు చేయడం జరిగింది. తిరుపతి లోకసభ స్థానం నుంచి ఆర్.పి. ఐ పార్టీ అభ్యర్థి ని తిరుపతి లోకసభ ఓటర్లు ఆర్. పి. ఐ. పార్టీ కార్యకర్తలు అత్యధిక మెజార్టీతో ఆర్. పి. ఐ. పార్టీ అభ్యర్థి ని గెలిపించి పార్లమెంట్ కి పంపాలని వేడుకున్నారు.
మీడియా సమావేశంలో ని దృశ్యాలు
ఆర్పీఐ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు sk మాబు మాట్లాడుతూ తిరుపతి లోకసభ అభ్యర్థి మనపాటి చక్రవర్తి ని ఎన్నిక చేయడం సంతోషం గా ఉందన్నారు. ఆయన విద్యావంతుడు, మంచి మనసున్న వ్యక్తి గా మరియు పేద ప్రజల సమస్యలు ఎప్పడి కప్పుడు మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులు కు తెలియచేస్తూ పరిష్కారానికి దారివేసే వ్యక్తి అన్నారు. అదే విధంగా తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికలో అక్కడి అధికార పార్టీని కాదని ఒక జర్నలిస్ట్ ని గెలిపించి న సంగతి ని గుర్తు చేసేరు. అక్కడి తరహాలో తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో ఆర్. పి. ఇ పార్టీ అభ్యర్థి ని అయిన జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి గెలిపించాలని తిరుపతి లోకసభ ఓటరు మహాశయులకు వేడుకున్నారు. ఆర్. పి. ఐ. పార్టీ జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు సుడిగాలి ప్రచారలు చేసి ఆయన గెలుపు కు మేమంతా తోడు ఉంటామని అన్నారు. అదే విధంగా మీడియా మిత్రులు అంతా జర్నలిస్ట్ చక్రవర్తి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజయ్య గౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ అరికొండ సురేష్, బాబా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.