*చట్టం తన పని తాను చేసుకుపోయింది : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*ప్రజల నగదు దోపిడికి గురయినప్పుడు చట్టం పని తన పని తాను చేసుకునిపోతుందని, ఇందుకు ఎవరూ మినహాయింపు కాదని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*శనివారం నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్కాం చేశారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని అన్నారు.*
*ఈ కేసు 2018 నుంచి కొనసాగుతుందని, 2021లోనే ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారన్నారు. ఈ కేసులో సూత్రధారులకు ఇప్పటికే నోటిసు ఇచ్చారని, లావాదేవిలు ఎలా జరగాయన్న విషయంపై సమగ్ర దర్యాప్తు జరపారన్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు కేసు దర్యాప్తు అనంతరం ఇవాళ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు.*
*ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు ఏ ప్రభుత్వమైనా దర్యాప్తు జరుపుతుందని, ప్రధానంగా గుర్తించిన వారి వద్ద వాంగ్మూలం తీసుకున్న అనంతరమే సీఐడి, ఐటి, ఈడీ శాఖల అధికారులు నోటిసు అందచేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ఇంకా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.*
*చంద్రబాబు అరెస్ట్ లో కక్ష సాధింపు ఏమీ లేదని, బాధ్యత ఉంది కాబట్టి సీఐడి రంగంలోకి దిగిందన్నారు. నిధులు ఎక్కడికి పోయాయనే విషయమై దర్యాప్తు జరుగుతుందని, అందుకే అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు.*
*టీడీపీ నేతలకు కుంభకోణం గురించి తెలిసినప్పటికి కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు. అరెస్ట్ లు రాజకీయ కోణం ఏమి లేదని, ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం వల్ల అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.*
*కొన్ని రాజకీయ పార్టీలు నాలుగేళ్ల పాటు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారని, గత నాలుగేళ్ల నుంచి సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అందులోభాగంగా అరెస్ట్ చేసినట్లు, రాజకీయ కక్ష సాధింపుగా అరెస్ట్ జరగలేదన్నారు.*
*స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం అందచేసిన నగదుకు సంబంధించి ఆ కంపెనీ యువతకు శిక్షణా ఇవ్వలేదు, ప్రభుత్వానికి తిరిగి చెల్లించని కారణంగానే ఇలా అరెస్ట్ చేయడం జరిగిందని, ఇందులో రాజకీయ కోణం ఏముంటుందని అన్నారు.*
*ప్రజాసామ్య వ్యవస్థలో అధికారుల దర్యాప్తు అనంతరం అవినీతి జరిగిందని చెబుతూ అరెస్ట్ చేయడం జరిగిందని, అవినీతి జరగలేదని మీరు నిరూపించుకోవాల్సి ఉందని అన్నారు. 2018 నుంచే విచారణ జరుగుతున్న సమయంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు దర్యాప్తు వేగవంతం చేయలేదన్నారు*
*కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నుండి ఇచ్చిన నోటిసుల విషయంలో సరైన సమాధానాలు రాకపోవడమే వల్ల ఇలా దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకున్నారని, దీనిపై గతంలో నోటిసులు వచ్చిన విషయంలో మా ప్రభుత్వంలో ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయలేదని, ఈ విషయమై మా ప్రభుత్వం బురద చల్లడం తగదని అన్నారు.*
Comments are closed.